Pradeep Sarkar : బాలీవుడ్ దర్శకుడు హఠాన్మరణం.. అజయ్ దేవగణ్ ఎమోషనల్ పోస్ట్..

బాలీవుడ్ లో ఎంతోమంది స్టార్స్ ని పరిచయం చేసిన దిగ్గజ దర్శకడు ప్రదీప్ సర్కార్ 68 ఏళ్ళ వయస్సులో కన్నుమూశారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక స్టార్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgn) ఎమోషనల్ పోస్ట్ వేశాడు.

Pradeep Sarkar : ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. బాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు ఏదోక మరణవార్త వినాల్సి వస్తుంది. తాజాగా బాలీవుడ్ దిగ్గజ దర్శకడు కన్నుమూసిన వార్త హిందీ పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తుంది. బాలీవుడ్ లో రైటర్‌గా, ఎడిటర్‌గా, ఆర్ట్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా, నిర్మాతగా కళామతల్లికి సేవలు అందించిన ప్రదీప్ సర్కార్ 68 ఏళ్ళ వయస్సులో కన్నుమూశారు. గత కొంత కాలంగా ప్రదీప్ సర్కార్ (Pradeep Sarkar) మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు.

VNRTrio : చిరంజీవి చేతులు మీదుగా గ్రాండ్‌గా లాంచ్ అయిన నితిన్ కొత్త సినిమా..

దీంతో ముంబైలోని ఒక హాస్పిటల్ లో డయాలసిస్ చికిత్స చేయించుకుంటూ వస్తున్నారు. అయితే ఈరోజు (మార్చి 24) తెల్లవారుజామున సడెన్ గా శరీరంలో పొటాసియం స్థాయులు పడిపోవడంతో ప్రదీప్ సర్కార్ ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్ లోని ఎంతోమంది స్టార్స్ తో ప్రదీప్ సర్కార్ కి ఆత్మీయ అనుబంధం ఉంది. దీంతో ఆయన మరణాన్ని తట్టుకోలేక భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgn).. ”దాదా మరణం జీర్ణించుకోలేక పోతున్నాను. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి” అంటూ ట్వీట్ చేశాడు.

Manchu Vishnu Vs Manoj : అన్నదమ్ముల గొడవ పై స్పందించిన మోహన్ బాబు.. నాకేం తెలియదంటున్న మంచు లక్ష్మి!

ఇక ఆయన దర్శకత్వంలో పలువురు స్టార్స్ కూడా వెండితెర అరగేంట్రం చేశారు. ఈ క్రమంలోనే నటి నీతూ చంద్ర.. తన సినీ కెరీర్ ఆయనతోనే మొదలైందని గుర్తు చేసుకుంటూ, ఆయనకి సంతాపం వ్యక్తం చేసింది. కాగా ప్రదీప్ సర్కార్ 2005లో ‘పరిణీత’ అనే సినిమాతో డైరెక్టర్ గా మొదటి సినిమా తీశారు. ఫస్ట్ మూవీతోనే తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆ తరువాత కూడా లగా చునారీ మే దాగ్, మర్దానీ, హెలికాప్టర్ ఈలా.. వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించారు. పలు వెబ్ సిరీస్ కి కూడా ఆయన దర్శకత్వం వహించారు.

ట్రెండింగ్ వార్తలు