Emraan Hashmi : బాలీవుడ్(Bollywood) నటుడు ఇమ్రాన్ హష్మీ బోల్డ్ సినిమాలకు పెట్టింది పేరు. ఒకానొక టైంలో లిప్ కిస్, రొమాన్స్ సీన్స్ లేకుండా ఇమ్రాన్ హష్మీ సినిమా ఉండేది కాదు. కానీ గత కొన్నాళ్లుగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి కొత్త తరహా పాత్రలతో వస్తున్నాడు. మొదటిసారి ఇమ్రాన్ హష్మీ తెలుగులో పవన్ కళ్యాణ్ OG సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇమ్రాన్ విలన్ పాత్రలో కనిపించబోతాడని సమాచారం.
ఆల్రెడీ ఇమ్రాన్ కి సంబంధించి చాలా వరకు OG షూట్ అయిపోయినట్లు తెలుస్తుంది. తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమా చేస్తున్నందుకు సౌత్ – బాలీవుడ్ మధ్య తేడా ఏంటి అని అడిగారు.
Also Read : Rashmika Mandanna : వాలెంటైన్స్ డే ప్లాన్స్ ఏంటంటున్న రష్మిక.. ఎవరినో తెలుసా..?
దీనికి ఇమ్రాన్ హష్మీ సమాధానమిస్తూ.. సౌత్ ఫిలిం మేకర్స్ బాలీవుడ్ వాళ్ళ కంటే చాలా క్రమశిక్షణగా ఉంటారు. బాలీవుడ్ లో సినిమా విషయాల్లో డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. కొన్ని సార్లు అవసరం లేని చోట కూడా ఖర్చు పెడతారు. కానీ సౌత్ లో ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. ఖర్చు చేసిన డబ్బులు సినిమా రూపంలో కనిపిస్తాయి. VFX, పాత్ బ్రేకింగ్ కథల విషయంలో సౌత్ దర్శకులు మనకంటే ముందు ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇమ్రాన్ హష్మీ కామెంట్స్ వైరల్ గా మారాయి.