Rashmika Mandanna : వాలెంటైన్స్ డే ప్లాన్స్ ఏంటంటున్న రష్మిక.. ఎవరినో తెలుసా..?

వాలెంటైన్స్ డే ప్లాన్స్ ఏంటంటూ రష్మిక పోస్ట్. ఎవర్ని అడుగుతున్నారో తెలుసా..?

Rashmika Mandanna : వాలెంటైన్స్ డే ప్లాన్స్ ఏంటంటున్న రష్మిక.. ఎవరినో తెలుసా..?

Rashmika Mandanna asking valentines day plans of them tweet gone viral

Updated On : February 13, 2024 / 8:06 PM IST

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. వరుస పాన్ ఇండియా హిట్స్ తో ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. ప్రస్తుతం చేతిలో కూడా మరో రెండు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అలాగే మూడు రీజినల్ సినిమాలు కూడా చేస్తున్నారు. దీంతో గ్యాప్ లేకుండా షూటింగ్స్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ వరుస షూటింగ్స్ వల్ల రష్మిక.. కొంచెం అనారోగ్యానికి గురయ్యారట. దీంతో ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారట. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యే రష్మిక.. ఈ రెస్ట్ మోడ్ లో అభిమానులను పలకరించారు.

రష్మిక ఇలా ట్వీట్ చేశారు.. “మీతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది గాయిస్. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. ఈరోజు అన్ని మాట్లాడేసుకుందాం. ఇప్పటివరకు జరిగిన ప్రతి విషయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే మీ వాలెంటైన్స్ డే ప్లాన్స్ కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు రెండు క్యూట్ సెల్ఫీలు కూడా షేర్ చేశారు. రష్మిక ట్వీట్ కి అభిమానులు రెస్పాండ్ అవుతుండడంతో.. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Also read : Tom Cruise : నాలుగోసారి ప్రేమలో పడ్డ టామ్ క్రూజ్.. 61ఏళ్ళ వయసులో 36ఏళ్ళ అమ్మాయితో..

ఇక రష్మిక చేస్తున్న సినిమాలు విషయానికి వస్తే.. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2లో నటిస్తున్నారు. అలాగే విక్కీ కౌశల్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పీరియాడిక్ మూవీ ‘చావ’లో కూడా హీరోయిన్ గా చేస్తున్నారు. ఇక తమిళంలో ధనుష్ సరసన శేఖర్ కముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్.. అనే రెండు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తున్నారు. వీటితో పాటు యానిమల్ 2, స్పిరిట్ కూడా లైనప్ లో ఉన్నాయి.