Bollywood star Serial Actor Ekta Sharma now working in a call center
Ekta Sharma : బాలీవుడ్ సీరియల్స్ లో బాగా పాపులర్ అయిన నటి ఏక్తా శర్మ. టీవీ షోలు, సీరియల్స్ తో పాపులారిటీ సంపాదించుకుంది ఏక్తా. డాడీ సంఝా కరో, కుసుమ్, క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ, కామినీ-దామిని లాంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది. కానీ ఇదంతా గతం. ఇప్పుడు అవకాశాలు లేక, పర్సనల్, ఫ్యామిలీ సమస్యలతో సతమతమవుతూ ఓ కాల్ సెంటర్లో జాబ్ చేసుకుంటుంది.
BiggBoss 6 Day 17 : దొంగా పోలీస్ ఆట.. ఒకర్నొకరు తిట్టుకోవడమే సరిపోయింది..
ఏక్తా శర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”కరోనా కారణంగా చాలా మంది జీవితాలు మారిపోయాయి. అందులోనే నా జీవితం కూడా తలకిందులయింది. ప్రస్తుతం ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాను. ఇల్లు గడవడం కూడా కష్టంగా మారడంతో ఉన్న నగలు అన్నీ అమ్మేశాను. అవకాశాలు కూడా రావట్లేదు. అవకాశాలు రావట్లేదని ఏడుస్తూ ఇంట్లో కూర్చోలేను కదా అందుకే కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నా. ఈ పని చేస్తున్నందుకు నాకేమీ తప్పుగా అనిపించడంలేదు. ప్రస్తుతం కోర్టులో నా కూతురి కస్టడీ కేసు కూడా నడుస్తుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని నేను ఎదురు చూడను. అందుకే ఇలా కాల్ సెంటర్ లో పని చేస్తూనే కుదిరినప్పుడల్లా మళ్ళీ ఆడిషన్స్ ఇస్తున్నాను. నాకు మళ్ళీ అవకాశాలు వస్తాయనే అనుకుంటున్నాను” అని ఎమోషనల్ అయింది.