HariHara VeeraMallu
HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా నేడు రిలీజయి థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నా పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్ వీరి చుట్టే కథ తిరుగుతుంది. అయితే గతంలో ఈ సినిమాలో చాలా మంది స్టార్ కాస్ట్ పేర్లు వినిపించాయి.
హరిహర వీరమల్లు సినిమాలో మొదట బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ని ఓ పాత్ర కోసం తీసుకున్నారు. కానీ తర్వాత ఆమెని తప్పించి నోరా ఫతేహిని తీసుకున్నారు. అలాగే నర్గిస్ ఫక్రిని కూడా తీసుకున్నారు అని వార్తలు వచ్చాయి. మూవీ యూనిట్ కూడా పలుమార్లు నోరా ఫతేహి పేరు ప్రస్తావించింది. ఆమె ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుందని అన్నారు. అయితే తీరా చూస్తే సినిమాలో ఈ ఇద్దరూ లేరు.
Also Read : కన్నడ సినిమాలు, హీరోలు, హీరోయిన్స్ ని మనం నెత్తిన పెట్టుకుంటే.. వాళ్ళు మాత్రం మన సినిమాలకు ఇలా..
నోరా ఫతేహితో షూటింగ్ కూడా చేసాం అన్నారు కానీ హరిహర వీరమల్లు సినిమాలో ఆమె ఎక్కడా కనపడలేదు. అయితే సెకండ్ పార్ట్ కి సంబంధించి 30 శాతం షూటింగ్ అయిపోయింది అన్నారు కాబట్టి అందులో ఉంటుందేమో అని భావిస్తున్నారు. ఇక నర్గిస్ ఫక్రి ఔరంగజేబు చెల్లెలి పాత్రలో కనిపించాలి. కానీ సినిమాలో కనిపించలేదు. దీంతో ఆమె కూడా సెకండ్ పార్ట్ లో కనిపిస్తారేమో అని అనుకుంటున్నారు.
అలాగే హరిహర వీరమల్లు సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటులు అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారని మూవీ యూనిట్ గతంలో ప్రకటించింది. కానీ ఆయన కూడా సినిమాలో కనిపించలేదు. మరి వీళ్ళ సీన్స్ ని ఎడిటింగ్ లో తీసేసారా? లేక సెకండ్ పార్ట్ లో ఉంటారా చూడాలి. హరిహర వీరమల్లు పార్ట్ 1 లో అయితే క్లైమాక్స్ అదిరిపోయే షాట్ తో ఎండ్ ఇచ్చారు. దానికి తగ్గట్టు పార్ట్ 2 తెరకెక్కిస్తారా లేదా చూడాలి.