Pawan Kalyan : మూడు రోజులు.. మూడు ఊళ్లు.. ప్రమోషన్స్, షూటింగ్.. తెల్లారేసరికి క్యాబినెట్ మీటింగ్.. నీ ఓపికకు దండం సామీ..
గత నాలుగు రోజులుగా పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు.

Pawan Kalyan
Pawan Kalyan : హరిహర వీరమల్లు సినిమా గురించి పక్కన పెడితే పవన్ ఓపికకు మాత్రం దండం పెట్టేస్తున్నారు జనాలు. అసలు ఇలా కూడా కష్టపడతారా అనేలా తిరుగుతున్నారు పవన్. గత నాలుగు రోజులుగా పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు.
సోమవారం నాడు పవన్ కళ్యాణ్ ఉదయం హైదరాబాద్ లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం హరిహర వీరమల్లుకు సంబంధించి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అదవ్వగానే మళ్ళీ ఉస్తాద్ షూటింగ్ కి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ మధ్యలో ఏపీ ప్రభుత్వ పనులు.
ఇక మంగళవారం ఉపముఖ్యమంత్రిగా పనులు చూసుకుంటూనే మధ్యమధ్యలో పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఉదయం మంగళగిరిలో అక్కడి లోకల్ మీడియాతో హరిహర వీరమల్లు గురించి మాట్లాడారు.
నిన్న బుధవారం ఉదయం మంగళగిరిలో హరిహర వీరమల్లు గురించి నేషనల్ మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చి హరిహర వీరమల్లు డిస్ట్రిబ్యూషన్ సమస్యలను పరిష్కరించారు. అదే రోజు రాత్రి వైజాగ్ వెళ్లి అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు.
Also Read : Cm Chandrababu: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ కావాలి- సీఎం చంద్రబాబు
ఇలా మూడు రోజులుగా ఓ పక్క ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు, మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్, పూర్తిస్థాయిలో హరిహర వీరమల్లు ప్రమోషన్స్ చేసి రెస్ట్ తీసుకోకుండానే నేడు ఉదయం వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. మళ్ళీ ఇవాళ సాయంత్రం హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ కోసం హైదరాబాద్ కి రానున్నారు.
ఇలా పవన్ వరుసగా గ్యాప్ లేకుండా కష్టపడటంతో నీ ఓపికకు దండం సామీ, పని మీద నీకున్న డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటూ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. పవన్ గతంలో కూడా ఓ పక్క రాజకీయాలు, ప్రభుత్వ బాధ్యతలు చేస్తూనే మధ్యమధ్యలో సినిమాలు చేసారు. అప్పుడు కూడా ఖాళీ లేకుండా కష్టపడ్డారు కానీ ఇప్పుడు వరుసగా మూడు నాలుగు రోజులు అసలు తీరిక లేకుండా ఉన్నా ఉపముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వరిస్తూనే ఊళ్లు తిరుగుతూ తను చేసిన సినిమాకు న్యాయం చేసారు అని అంటున్నారు.