కన్నడ సినిమాలు, హీరోలు, హీరోయిన్స్ ని మనం నెత్తిన పెట్టుకుంటే.. వాళ్ళు మాత్రం మన సినిమాలకు ఇలా..

తెలుగువాళ్లు మంచి సినిమా ఏ భాష నుంచి వచ్చిన నెత్తిన పెట్టుకొని పెద్ద హిట్ చేస్తాం.

కన్నడ సినిమాలు, హీరోలు, హీరోయిన్స్ ని మనం నెత్తిన పెట్టుకుంటే.. వాళ్ళు మాత్రం మన సినిమాలకు ఇలా..

Kannada Movies

Updated On : July 24, 2025 / 1:27 PM IST

Kannada Movies : మన తెలుగువాళ్లు మంచి సినిమా ఏ భాష నుంచి వచ్చిన నెత్తిన పెట్టుకొని పెద్ద హిట్ చేస్తాం. మన తెలుగు హీరోలనే కాదు వేరే భాషల హీరోలను ప్రేమిస్తాం. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల హీరోలకు కూడా ఇక్కడ అభిమానులు ఉన్నారు. కొంతమంది వేరే భాష హీరోలను, సినిమాలను అయితే మన సొంత తెలుగు హీరోలు, సొంత తెలుగు సినిమాలు అనుకుంటాం.

కానీ ఇదంతా ఒకవైపే. మనమే వాళ్ళు మన అనుకుంటాం. వేరే భాషల్లో తెలుగు సినిమాలను, తెలుగు హీరోలను పట్టించుకోరు. ముఖ్యంగా తమిళ్, కన్నడ భాషల్లో. ఈ రెండు రాష్ట్రాలు ఇటీవల భాష కోసం గొడవపడుతూ వాళ్ళ భాష మాట్లాడకపోతే అక్కడ ఉండొద్దని చెప్పడం, కొట్టడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ఓ ఘటన వైరల్ గా మారడంతో తెలుగు ప్రేక్షకులు ఆగ్రహానికి గురయ్యారు.

Also Read : Pawan Kalyan : మూడు రోజులు.. మూడు ఊళ్లు.. ప్రమోషన్స్, షూటింగ్.. తెల్లారేసరికి క్యాబినెట్ మీటింగ్.. నీ ఓపికకు దండం సామీ..

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నిన్న బెంగుళూరులో ఉన్న పవన్ ఫ్యాన్స్ అక్కడ ఓ థియేటర్స్ వద్ద హరిహర వీరమల్లు బ్యానర్లు కట్టి సందడి చేస్తున్నారు. అక్కడ తెలుగు, కన్నడ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ కొంతమంది వచ్చి బ్యానర్లు కన్నడ భాషలో లేవని ఆ బ్యానర్లను చింపేసారు. తెలుగు సినిమాలు ఇక్కడ ఆడించొద్దు అంటూ విమర్శలు చేసారు. దీంతో అక్కడ పెద్ద గొడవే అయింది. ఈ విషయంపై తెలుగు పవన్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మనమేమో కన్నడ సినిమాలను, కన్నడ హీరోలను నెత్తిన పెట్టుకుంటాం. ఇటీవల కేజిఎఫ్, సప్తసాగరాలు దాటి, కాంతార.. లాంటి పలు సినిమాలు తెలుగులో పెద్ద హిట్ చేసాం. యష్, రిషబ్ శెట్టి, దివంగత పునీత్, శివన్న, రక్షిత్ శెట్టి, రాజ్ శెట్టి.. ఇలా చాలా మంది కన్నడ హీరోలకు ఇక్కడ మంచి ఫ్యాన్స్ ఉన్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణించినప్పుడు కన్నడ వాళ్ళు ఎంత బాధపడ్డారో తెలుగు ప్రేక్షకులు అంతే బాధపడ్డారు. ఇక మన తెలుగు సినిమాల్లో అప్పుడెప్పుడో అనుష్క నుంచి ఇటీవల కృతిశెట్టి వరకు సగం మంది కన్నడ హీరోయిన్సే. వాళ్ళు వచ్చి ఇక్కడ కన్నడలో మాట్లాడినా మనం ఏం అనము. కన్నడ సినిమాలను డబ్బింగ్ లేకుండానే చూస్తాము. ఇలా మనం ప్రతి విషయంలోనూ కన్నడ సినిమా మనది అని ఫీల్ అయితే వాళ్ళు మాత్రం అకారణంగా ఇలా మన సినిమాల మీద, మన భాష మీద వివక్ష చూపిస్తున్నారు.

Also Read : Hari Hara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ మూవీ రివ్యూ.. పవన్ కళ్యాణ్ పీరియాడికల్ యాక్షన్ సినిమా ఎలా ఉందంటే..