Vijay Varma Buys Costly Apartment in Mumbai after Breakup with Tamannaah Bhatia
Vijay Varma : నటుడు విజయ్ వర్మ హిందీలో అనేక సినిమాల్లో, సిరీస్ లలో కీ రోల్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో నాని MCA సినిమాలో విలన్ గా చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023లో తమన్నాతో కలిసి ఓ సినిమాలో నటించాడు. ఆ సినిమాలో వీరిద్దరికి చాలానే రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఆ సినిమా చేసేటప్పుడే వీరు ప్రేమలో పడ్డారు.
ముందే వీరి ప్రేమ గురించి రూమర్స్ రాగా విజయ్, తమన్నా కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ 2 సినిమా రిలీజ్ సమయంలో వీరిద్దరూ వీరి ప్రేమను అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అనేక ఈవెంట్స్ కి హాజరయ్యారు. పార్టీలకు, ట్రిప్స్ కి వెళ్లారు. ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పారు మీడియా ముందు. కానీ రెండేళ్ల ప్రేమ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇద్దరూ విడిపోయారు. విడిపోయింది మాత్రం అధికారికంగా ప్రకటించకపోయినా వీరిద్దరూ కలవడం, కలిసి కనపడటం మానేశారు. బాలీవుడ్ లో విజయ్, తమన్నా సన్నిహితులు అయితే వీరిద్దరూ విడిపోయారు అనే చెప్పారు.
Also See : Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ పాత ఫొటోలు చూశారా? 35 ఏళ్ళ క్రితం ఫొటోలు షేర్ చేసిన షారుఖ్ ఫ్రెండ్..
అయితే తాజాగా విజయ్ వర్మ ఓ ఖరీదైన అపార్ట్మెంట్ కొనడంతో వార్తల్లో నిలిచాడు. ముంబైలో అత్యంత ఖరీదైన ఏరియా, సెలబ్రిటీలు ఉండే జుహు ఏరియాలో అరేబియా సముద్రం ఫేసింగ్ ఉన్న ఖరీదైన అపార్ట్మెంట్ విజయ్ వర్మ కొనుక్కున్నాడు. ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ తన యూట్యూబ్ ఛానల్ లో విజయ్ వర్మ కొత్త ఇల్లు వ్లోగ్ చేస్తూ ఇంటర్వ్యూ చేసింది.
దీంతో విజయ్ కొత్త ఇల్లు కొన్న విషయం వైరల్ గా మారింది. అయితే దీని ఖరీదు ఎంతో చెప్పలేదు కానీ కోట్లలోనే ఉంటుందని ఈజీగా తెలుస్తుంది. తమన్నాతో బ్రేకప్ తర్వాత విజయ్ కొత్త ఇల్లు కొనడంతో ఈ వార్త ఆసక్తిగా మారింది. ఇక పలువురు విజయ్ అభిమానులు కంగ్రాట్స్ చెప్తూ ఇల్లు బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. ఫరాఖాన్ – విజయ్ వర్మని ఇంటర్వ్యూ చేస్తూ తన కొత్తింటిని చూపించిన వీడియో మీరు కూడా చూసేయండి..