Sukumar Children’s : స్కూల్ లో నాటకం వేసిన సుకుమార్ కూతురు.. గిటార్ వాయించిన కొడుకు.. పిల్లలతో తబిత.. ఫొటోలు వైరల్..

తాజాగా సుకుమార్ భార్య తన కూతురు, కొడుకు స్కూల్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఫోటోలను షేర్ చేసింది.

Sukumar Children’s : స్కూల్ లో నాటకం వేసిన సుకుమార్ కూతురు.. గిటార్ వాయించిన కొడుకు.. పిల్లలతో తబిత.. ఫొటోలు వైరల్..

Sukumar Children's Sukriti and Sukranth Participated in School Program

Updated On : May 19, 2025 / 8:06 PM IST

Sukumar Children’s : సుకుమార్ కూతురు సుకృతి ఇప్పటికే మెయిన్ లీడ్ లో ఒక సినిమా చేసి అందర్నీ మెప్పించింది. గాంధీ తాత చెట్టు సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి అవార్డులు కూడా గెలుచుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పాపులారిటీ తెచ్చుకుంది సుకుమార్ కూతురు. ఇప్పుడు సుకుమార్ కొడుకు కూడా వైరల్ అవుతున్నాడు.

తాజాగా సుకుమార్ భార్య తన కూతురు, కొడుకు స్కూల్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఫోటోలను షేర్ చేసింది. సుకుమార్ పిల్లలు చదివే స్కూల్ లో ఓ ఈవెంట్ జరగ్గా ఆ ఈవెంట్లో సుకుమార్ కూతురు సుకృతి ఒక నాటకం వేసింది. దీనికి సంబంధించిన చిన్న వీడియో తబిత పోస్ట్ చేసింది. అదే ప్రోగ్రాంలో సుకుమార్ కొడుకు సుక్రాంత్ గిటార్ వాయిస్తున్నాడు. సుక్రాంత్ గిటార్ వాయించిన వీడియో కూడా పోస్ట్ చేసింది తబిత.

Sukumar Children's Sukriti and Sukranth Participated in School Program

Also Read : Allu Arjun : అమెరికాకు అల్లు అర్జున్.. అట్లీ సినిమా కోసం కాదు.. ఎప్పుడు వెళ్తున్నాడో తెలుసా..?

అలాగే తన పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి దిగిన పలు ఫోటోలను తబిత సుకుమార్ సోషల్ మీడియాలో షేర్ చేసి తన పిల్లలను చూస్తుంటే గర్వంగా ఉందని రాసుకొచ్చింది. దీంతో తబిత పోస్ట్, ఫొటోలు వైరల్ గా మారాయి. ఇప్పటికే సుకుమార్ కూతురు హీరోయిన్ అవుతుంది అని అంతా భావిస్తున్నారు. ఈ పోస్ట్ తో సుకుమార్ కొడుకు మ్యుజిషియన్ అవుతాడేమో అని కామెంట్స్ చేస్తూ ఇద్దర్ని అభినందిస్తున్నారు.

Also Read : Sunitha Manohar : బాహుబలిలో రమ్యకృష్ణకు డూప్ గా.. ఈ నటి ఎవరో తెలుసా? మహేష్ సినిమాలో రియల్ స్టంట్స్ చేసి..