Allu Arjun : అమెరికాకు అల్లు అర్జున్.. అట్లీ సినిమా కోసం కాదు.. ఎప్పుడు వెళ్తున్నాడో తెలుసా..?

త్వరలో అల్లు అర్జున్ అమెరికాకు వెళ్లబోతున్నాడు.

Allu Arjun : అమెరికాకు అల్లు అర్జున్.. అట్లీ సినిమా కోసం కాదు.. ఎప్పుడు వెళ్తున్నాడో తెలుసా..?

Allu Arjun Going to America for Participating in a Private Event

Updated On : May 19, 2025 / 7:45 PM IST

Allu Arjun : పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ స్టార్ డమ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్ప 2తో ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప 2 ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలో గ్రాఫిక్ పార్ట్ ఎక్కువ ఉంది అంటూ అమెరికా లాస్ ఏంజిల్స్ కి వెళ్లి అక్కడి హాలీవుడ్ గ్రాఫిక్ కంపెనీతో మాట్లాడి వచ్చిన వీడియోని రిలీజ్ చేసారు. దీంతో ఈ సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Sunitha Manohar : బాహుబలిలో రమ్యకృష్ణకు డూప్ గా.. ఈ నటి ఎవరో తెలుసా? మహేష్ సినిమాలో రియల్ స్టంట్స్ చేసి..

అయితే త్వరలో అల్లు అర్జున్ అమెరికాకు వెళ్లబోతున్నాడు. అయితే సినిమా కోసం మాత్రం కాదు. ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొనడానికి వెళ్తున్నాడు. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాట్స్) నిర్వహిస్తున్న 8వ తెలుగు సంబరాల్లో అల్లు అర్జున్ పాల్గొనబోతున్నారు. జూలై 4, 5, 6 తేదిల్లో ఈ సంబరాలు జరగనున్నాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపాలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల్లో ఏదో ఒకరోజు అల్లు అర్జున్ ఈ వేడుకలో పాల్గొని అక్కడి తెలుగు వారిని కలవనున్నారు. దీంతో అమెరికాలోని తెలుగు వాళ్ళు అల్లు అర్జున్ ని చూడటం కోసం ఎదురుచూస్తున్నారు.

 

Also Read : Sridevi : మా అమ్మ సింగిల్ పేరెంట్.. స్టేజిపై ఏడ్చేసిన ‘కోర్ట్’ హీరోయిన్.. అమ్మని హత్తుకొని.. వీడియో వైరల్..