Sridevi : మా అమ్మ సింగిల్ పేరెంట్.. స్టేజిపై ఏడ్చేసిన ‘కోర్ట్’ హీరోయిన్.. అమ్మని హత్తుకొని.. వీడియో వైరల్..
కోర్ట్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది శ్రీదేవి.

Court Movie Fame Actress Sridevi gets Emotional while Talking about her Mother in Zee Apsara Awards Event
Sridevi : ఇటీవల కోర్ట్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది శ్రీదేవి. కోర్ట్ సినిమాలో హీరోయిన్ గా తన నటనతో అందర్నీ మెప్పించింది. సోషల్ మీడియాలో రీల్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న తెలుగమ్మాయి శ్రీదేవికి కోర్ట్ సినిమాలో ఛాన్స్ రావడంతో తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టి ఫ్యాన్స్ ని, ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. కోర్ట్ తో వచ్చిన స్టార్ డమ్ తో పలు అవకాశాలతో పాటు షాప్ ఓపెనింగ్స్, సినిమా ఈవెంట్స్, టీవీ ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవుతుంది.
ఇటీవల జీ అప్సర అవార్డ్స్ ని ప్రకటించగా ఇందులో అవార్డు గెలుచుకుంది శ్రీదేవి. తాజాగా ఈ ప్రోగ్రాంలో శ్రీదేవి కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు.
Also See : Ariyana Glory : బ్లాక్ డ్రెస్ లో బంగారు బాతులా.. అరియనా గ్లోరీ ఫొటోలు..
ఈ ప్రోమోలో శ్రీదేవి అవార్డు అందుకున్న తర్వాత మాట్లాడుతూ.. ఈ అవార్డు తీసుకుంటున్నాను అంటే కారణం కోర్ట్ సినిమానే. మా మమ్మీ కూడా సింగిల్ పేరెంట్. చాలా స్ట్రగుల్ చేసింది మమ్మీ. మా అక్కను, నన్ను ఒక సింగిల్ పేరెంట్ గా కష్టపడి పెంచి ఈ రోజు ఈ పొజిషన్ కి తీసుకొచ్చింది. థ్యాంక్యూ సో మచ్ అమ్మ అంటూ ఏడుస్తూ స్టేజిపై ఉన్న వాళ్ళ అమ్మను హత్తుకొని ఎమోషనల్ అయింది. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.
Also Read : Manchu Manoj : రాజకీయాల్లోకి రావడంపై మనోజ్ క్లారిటీ.. దాన్ని మీరేమంటారో మీ ఇష్టం అంటూ..