Boney Kapoor : నేనెప్పుడు శ్రీదేవిని మోసం చేయ‌లేదు.. నేను చనిపోయేదాకా ఆమెనే ప్రేమిస్తాను.. బోనీ క‌పూర్ కామెంట్స్‌

శ్రీదేవిని బోనీక‌పూర్ ఏడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Boney Kapoor says I never cheated Sridevi

అల‌నాటి అందాల తార‌, అతిలోక సుంద‌రి శ్రీదేవి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. తెలుగు, త‌మిళం, హిందీ మూవీల్లో న‌టించి ఎంతో మంది హృద‌యాల్లో చెద‌రని ముద్ర వేసుకుంది. 1996లో బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు (జాన్వీ, ఖుషి). 2018 దుబాయ్‌లో శ్రీదేవి ఓ ఐదు న‌క్ష‌త్రాల హోట‌ల్‌లో బాత్ ట‌బ్‌లో కాలు జారి ప‌డి మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆమె దూర‌మై ఇంత‌కాల‌మైనా స‌రే ఆ విష‌యాన్ని అభిమానులు ఎవ్వ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు.

శ్రీదేవిని బోనీక‌పూర్ ఏడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో బోనీక‌పూర్ మాట్లాడుతూ.. శ్రీదేవి పై త‌న‌కున్న ప్రేమ‌ను వ్య‌క్తం చేశారు. ఆమె ప్ర‌స్తుతం ఈ లోకంలో లేక‌పోయిన‌ప్ప‌టికి ఆమెను త‌న జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాన‌న్నాడు. ప్రేమ‌, పెళ్లి విష‌యాల్లో ఆమెను ఒప్పించేందుకు దాదాపు ఆరేళ్లు ప‌ట్టింద‌న్నాడు. మొద‌టి సారి ప్ర‌పోజ్ చేసిన‌ప్పుడు శ్రీదేవి తిట్టిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు. దాదాపు ఆరు నెల‌లు త‌న‌తో ఆమె మాట్లాడ‌లేద‌న్నారు.

Manmohan Singh : మన్మోహన్ సింగ్ పై సినిమా వచ్చింది తెలుసా? అందులో మన్మోహన్ పాత్రలో ఎవరు నటించారో తెలుసా?

మీకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీరు నాతో ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు? అని తిట్టింద‌న్నారు. త‌న మ‌న‌సులో ఉన్న భావాన్ని పూర్తిగా తెలియ‌జేసిన త‌రువాత కొంత‌కాలానికి త‌న ప్రేమ‌ను అంగీక‌రించింద‌న్నారు. విధి కూడా అనుకూలించింద‌ని చెప్పాడు.

శ్రీదేవిని తానెప్పుడు మోసం చేయ‌లేద‌న్నాడు. త‌న స‌ర్వ‌స్వం ఆమె అని చెప్పాడు. ఇత‌ర మ‌హిళ‌ల విష‌యంలో ఆక‌ర్షితుడైన‌ప్ప‌టికి శ్రీదేవిపై త‌న‌కున్న ప్రేమ ఎప్ప‌టికి చావ‌ద‌ని చెప్పారు. `నాకు ఈ రోజు ఆడ‌ స్నేహితులు ఉండవచ్చు. నా చుట్టూ ఉన్న ఆడవారి పట్ల నేను ఆకర్షితుడవుతాను. కానీ ఆమెకు సంబంధించినంతవరకు అభిరుచి, ప్రేమ ఎప్పటికీ పోవు“ అని బోనీ క‌పూర్ తెలిపారు. ఆమె లేని లోటును ఎవ్వ‌రూ భ‌ర్తీ చేయ‌లేర‌న్నారు.

Allu Arjun Bail Petition : అల్లు అర్జున్ రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ వాయిదా..

ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే నమ్మకం వల్లే వారి మధ్య బంధం బలపడుతుందని, అది రోజురో జుకీ అది పెరుగుతూ ఉండాలన్నారు. ఈ భూమ్మీద ఎవరూ పర్‌ఫెక్ట్‌ కాదని.. తాను కూడా పర్‌ఫెక్ట్‌ కాదన్నారు. శ్రీదేవితో ప్రేమలో పడటానికి ముందే త‌న‌కు పెళ్లై, పిల్ల‌లు ఉన్నార‌న్నారు.  అలా అని.. ఆ విషయాన్ని నేను ఎక్కడా దాచలేదు. త‌న ప్రేమ గురించి మొద‌టి భార్య, పిల్ల‌లకు చెప్పాన‌ని వారు అర్థం చేసుకున్నార‌న్నాడు. విషయం ఏదైనా సరే భాగస్వామి, పిల్లలతో ఎప్పుడూ నిజాయితీగా ఉండాల‌ని బోనీ చెప్పారు.

శ్రీదేవీతో పెళ్లి కంటే ముందు 1983లో టీవీ, మూవీ నిర్మాత మోనా శౌరీని బోనీక‌పూర్ పెళ్లి చేసుకున్నారు. వీరికి అర్జున్ క‌పూర్‌, అన్షులా క‌పూర్ అనే పిల్ల‌లు ఉన్నారు.