Allu Arjun Bail Petition : అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా..
అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణను వాయిదా వేసింది.

అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణను వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో విచారణను ఈ నెల 30 కి వాయిదా వేసింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఇటీవల అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరచగా నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అదే సమయంలో తెలంగాణ హైకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు.
Hari Hara Veera Mallu : అభిమానులకు పండగ..! కొత్త ఏడాది పవన్ గాత్రంతో గ్రాండ్ వెల్‌కమ్..!
కాగా.. అల్లు అర్జున్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ వర్చువల్‌గా కోర్టుకు హాజరు అయ్యారు. వాస్తవానికి అల్లు అర్జున్ నేరుగా కోర్టుకు రావాల్సి ఉండగా.. ఆన్‌లైన్ ద్వారా హాజరుఅవుతానని న్యాయవాదుల ద్వారా కోర్టును కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరించడంతో వర్చువల్‌గా హాజరు అయ్యారు అల్లు అర్జున్.
హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయాన్ని నాంపల్లి కోర్టుకు తెలిపారు న్యాయవాదులు. అదే సమయంలో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సోమవారానికి వాయిదా పడింది.