Hari Hara Veera Mallu : అభిమానులకు పండగ..! కొత్త ఏడాది పవన్ గాత్రంతో గ్రాండ్ వెల్‌కమ్..!
పవన్ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికి సమయం దొరికినప్పుడు సినిమాలను చేస్తూ ఉన్నారు. పవన్ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. కొత్త ఏడాది సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేయనున్నారు. జనవరి 1న 12 గంటలకు ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేయనున్నారట. ఈ పాటను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడారట. తెలుగుతో పాటు మిగిలిన బాషల్లోనూ ఈ పాటను పవన్ పాడారనేది సదరు వార్త సారాంశం.
Allu Arjun : నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న అల్లు అర్జున్
అయితే.. ఈ పాట గురించి చిత్ర బృందం ఇప్పటి వరకు అయితే ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. ఒకవేళ అదే నిజమైతే పవన్ అభిమానులకు కొత్త సంవత్సరం ప్రారంభానికి ఇంతకు మించిన ఆనందం ఇంకొటి ఉండదు.
అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం మార్చి 28న విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Hari Hara Veera Mallu
1⃣st single – Jan 1st 1⃣2⃣ AM✅
Vocals – Pawan Kalyan🎙️ pic.twitter.com/2LNC9GR6GG— Manobala Vijayabalan (@ManobalaV) December 26, 2024