Allu Arjun : నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న అల్లు అర్జున్
సినీ నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు రానున్నారు.

సినీ నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు రానున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడిషియల్ రియాండ్ విధించిన సంగతి తెలిసిందే. రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ రానున్నారు. ఇదే కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ విషయాన్ని న్యాయవాదుల ద్వారా కోర్టుకు తెలుపనున్నారు అల్లు అర్జున్. ఇప్పటికే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కోర్టుకు చేరుకున్నారు.
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్‌తో పాటు మూవీ టీమ్ రావడంతో అభిమానులు భారీగా వచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట ఘటన జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘనటపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 13న అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించారు. అదే సమయంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను వేయాలని చెప్పింది.
దీంతో డిసెంబర్ 14న అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చారు. డిసెంబర్ 24న అల్లు అర్జున్ మరోసారి పోలీసులు విచారించారు. దాదాపు మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు విచారించారు. విచారణ అనంతరం అవసరం అయితే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని అల్లు అర్జున్ తెలిపారు.
Kichcha Sudeep Max : ‘మ్యాక్స్’ మూవీ రివ్యూ.. ఒక్క రాత్రిలో విధ్వంసం చేశారుగా..
రిమాండ్ గడువు ముగియడంతో నేడు నాంపల్లికి కోర్టుకు అల్లు అర్జున్ రానున్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. అటు రేవతి కుటుంబానికి పుష్ప 2 టీమ్ రూ.2 కోట్ల సాయం అందించింది. అల్లు అర్జున్ తరుపున కోటి, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో 50 లక్షలు అందించారు.