Amitabh Bachchan : ‘నేను అల్లు అర్జున్ వీరాభిమానిని..’ కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అల్లు అర్జున్ పై కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రొగ్రామ్‌లో బాలీవుడ్ నటుడు, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు.

Amitabh Bachchan says he is Allu Arjun fan in KBC
పుష్ప 2 మూవీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రొగ్రామ్‌లో బాలీవుడ్ నటుడు, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ సైతం అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అదే సమయంలో తనను ఐకాన్ స్టార్‌తో పోల్చవద్దన్నాడు. ఇప్పటి వరకు ఎవరైన పుష్ప 2 మూవీని చూడకపోతే వెంటనే చూడాలని ప్రేక్షకులను కోరారు.
అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షో విజయవంతంగా ప్రసారం అవుతోంది. ప్రస్తుతం 16వ సీజన్ నడుస్తోంది. తాజా ఎపిసోడ్‌కు కోల్‌కతాకు చెందిన రజనీ బర్నివాల్ అనే గృహిణి కంటెస్టెంట్‌గా వచ్చింది. ఓ సందర్భంలో ఆమె తనకు అల్లు అర్జున్, అమితాబ్ బచ్చన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది.
Kichcha Sudeep Max : ‘మ్యాక్స్’ మూవీ రివ్యూ.. ఒక్క రాత్రిలో విధ్వంసం చేశారుగా..
దీనిపై అమితాబ్ మాట్లాడుతూ.. తాను కూడా అల్లు అర్జున్‌కు వీరాభిమాని అని చెప్పాడు. బన్నీ ప్రతిభావంతుడైన నటుడు అని చెప్పాడు. ఇప్పటి వరకు వచ్చిన గుర్తింపులు అన్నింటికి అతడు పూర్తి అర్హుడు అని అన్నాడు. అతడు నటించిన పుష్ప 2: ది రూల్ మూవీ ఇటీవలే విడుదలైంది. అద్భుతమైన విజయం సాధించింది. ఇంకా ఎవరైనా ఆ సినిమా చూడకపోతే వెంటనే చూడాలన్నాడు. బన్నీ గొప్ప నటుడు అని అన్నాడు. అతడితో తనను పోలవద్దు అంటూ సరదాగా చెప్పారు.
ఇదిలా ఉంటే.. పుష్ప 2 ప్రమోషన్ సందర్భంగా అల్లు అర్జున్ ముంబై వచ్చిన క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు అమితాబచ్చన్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని అన్నారు. ఎంతో మంది నటీనటులకు ఆయన స్ఫూర్తి అని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే తాను ముందుకు వెలుతున్నట్లుగా చెప్పారు. ఈ వీడియోని షేర్ చేసిన అమితాబ్ బచ్చన్.. బన్నీ పని తీరుకు తాను అభిమానిని అని చెప్పారు.