Daggubati Suresh Babu : సంధ్య థియేటర్ లాంటి ఘటనలు జరక్కుండా ఏం చేయాలి? స్టార్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిర్మాత సురేశ్ బాబు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
'తొక్కిసలాట ఘటనలు ఎక్కడైనా, ఎప్పుడైనా జరగొచ్చు. ఈవెంట్స్ ఎక్కడ చేసినా పబ్లిక్ ఎక్కువగా వస్తున్నారు.

Producer Daggubati Suresh Babu On Sandhya Theatre Incident
Daggubati Suresh Babu : సినీ పరిశ్రమ పెద్దలు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో సినీ పరిశ్రమపై రేవంత్ సర్కార్ సీరియస్ అవడం, అసెంబ్లీ వేదికగా సినీ పెద్దలపై సీఎం రేవంత్ విరుచుకుపడటం, ఇకపై బెనిఫిట్ షోలకు, టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి లేదనడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటీలో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? ఇప్పుడు ఇండస్ట్రీకి ఏం కావాలి? బెనిఫిట్ షోలు అవసరమేనా? చిన్న సినిమాలకు మంచి రోజులు వస్తాయా? సంధ్య థియేటర్ లాంటి ఘటనలు జరగడానికి కారణం ఎవరు? అలాంటి ఘటనలు భవిష్యత్తులో జరక్కుండా ఏం చేయాలి? స్టార్లు ఎలా నడుచుకోవాలి? ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
Also Read : చిన్న సినిమాలకు మంచి రోజులు వస్తాయా? నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
సంధ్య థియేటర్ లాంటి ఘటనలు జరక్కుండా ఏం చేయాలి?
‘అది చాలా దురదృష్టకరమైన ఘటన. చాలా బాధాకరం. అలాంటి ఘటనలు జరక్కుండా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలి. సినీ స్టార్లు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో అందరి చేతుల్లోనూ సెల్ ఫోన్లు ఉన్నాయి. స్టార్లు ఎక్కడ కనిపించినా ఫోటోల కోసం మీద పడిపోతున్నారు. సోషల్ మీడియా కారణంగా స్టార్లపై మరింత ఒత్తిడి పడింది. ఇద్దరూ(స్టార్లు, పబ్లిక్) కంట్రోల్ చేసుకోవాలి. స్టార్లను తోసే పబ్లిక్, పబ్లిక్ ను తోసే స్టార్లు.. ఇద్దరూ అదుపు చేసుకోవాలి. పబ్లిక్ ప్లేసుల్లో ఈవెంట్స్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని నిర్మాత సురేశ్ బాబు అన్నారు.
పబ్లిక్ ప్లేసుల్లో సినీ స్టార్లు ఎలా ఉండాలి? సంధ్య థియేటర్ లాంటి ఘటనలను కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి?
‘తొక్కిసలాట ఘటనలు ఎక్కడైనా, ఎప్పుడైనా జరగొచ్చు. ఈవెంట్స్ ఎక్కడ చేసినా పబ్లిక్ ఎక్కువగా వస్తున్నారు. ఈవెంట్స్ గురించి ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నాం. ఈవెంట్స్ నిర్వహణలో కచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తొక్కిసలాట ఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరు. అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచుల సమయంలోనూ తొక్కిసలాట ఘటనలు జరుగుతున్నాయి.
మాబ్ ఫ్రెంజీ తో సమస్య ఉంది. మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి జనం ఉంటే మనం వెళ్లకూడదు కదా. వెళ్లే వాళ్లు కంట్రోల్ చేసుకోవాలి. క్రౌడ్ ను కంట్రోల్ చేసే వాళ్లు మరింత బెటర్ గా కంట్రోల్ చేయాలి. పోలీస్, లోకల్ సెక్యూరిటీ.. ఇది ప్రతీ ఒక్కరి బాధ్యత. పబ్లిక్ ప్లేస్ లకు వెళ్లేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి.
జపాన్ లో ట్రైన్ లో వెళ్లినా గట్టిగా మాట్లాడరు. మన దగ్గర పది మంది కలిసినా.. గోల గోల చేసే వారుంటారు. పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఎలా బిహేవ్ చేయాలి? అన్నది ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. అది అందరం తెలుసుకుంటే ఆటోమేటిక్ గా బెటర్ అవుతుంది. అది సివిక్ సెన్స్. పిల్లలకు పెద్దలు నేర్పించాలి. స్కూళ్లు, కాలేజీల నుంచే నేర్పించాలి. పబ్లిక్ ప్లేసులకు వెళ్లినప్పుడు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో నువ్వు ఎగురు, డ్యాన్స్ చెయ్యి, ఏమైనా చెయ్యి. కానీ, బయటకు వచ్చినప్పుడు కొంచెం పద్దతిగా ఉండాలి కదా” అని నిర్మాత సురేశ్ బాబు తేల్చి చెప్పారు.