Daggubati Suresh Babu : చిన్న సినిమాలకు మంచి రోజులు వస్తాయా? నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
సినిమాను అమ్మడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఓటీటీలు, శాటిలైట్లు ఉన్నాయి.

Producer Daggubati Suresh Babu
Daggubati Suresh Babu : సినీ పరిశ్రమ పెద్దలు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో సినీ పరిశ్రమపై రేవంత్ సర్కార్ సీరియస్ అవడం, అసెంబ్లీ వేదికగా సినీ పెద్దలపై సీఎం రేవంత్ విరుచుకుపడటం, ఇకపై బెనిఫిట్ షోలకు, టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి లేదనడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటీలో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? ఇప్పుడు ఇండస్ట్రీకి ఏం కావాలి? బెనిఫిట్ షోలు అవసరమేనా? చిన్న సినిమాలకు మంచి రోజులు వస్తాయా? చిన్న సినిమాల నిర్మాతలకు ఏం చేస్తే బాగుంటుంది? సినీ పెద్దలు కోరారు? ముఖ్యమంత్రి ఏం చెప్పారు? సీఎంతో భేటీలో ఎలాంటి సానుకూల స్పందన వచ్చింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీపై ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
చిన్న, మధ్య తరహా సినిమాలకు సంబంధించి అగమ్యగోచరంగా మారింది అంటున్నారు. రిలీజ్ అయ్యే సినిమాలు 200కు పైనే.. హిట్ అయ్యే సినిమాలు కేవలం 7 నుంచి 8శాతమే ఉన్నాయి. ఇది ఇండస్ట్రీకి మంచిదేనా? సక్సెస్ రేట్ పెరగాలంటే ఏం చేయాలి?
‘సక్సెస్ రేట్ ఉండాలంటే సినిమా బాగా తీయాలి. బాగా తీసిన సినిమా చిన్నదైనా పెద్దదైనా ఆడేస్తుంది. బలగం అనేది చిన్న సినిమా. ప్రేక్షకులు ఆదరించారు. రీసెంట్ గా అమరన్ మూవీ.. శివ కార్తికేయన్ స్టాండర్డ్స్ కన్నా ట్రిపుల్ కలెక్షన్లు వచ్చాయి. మంచి సినిమా ఎవరు తీసినా దానికి మార్కెట్ ఉంది’ అని దగ్గుబాటి సురేశ్ బాబు తెలిపారు.
Also Read : బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు చిన్న అంశం.. సీఎంతో మీటింగ్ తర్వాత దిల్ రాజు కామెంట్స్..
సినీ పరిశ్రమ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం ఆశించారు?
‘డ్రగ్స్ నిర్మూలన చాలా అవసరం. మనం జాగ్రత్తగా ఉండకపోతే అది సమాజాన్ని నాశనం చేస్తుంది. డ్రగ్స్ దందా.. పెద్ద వ్యాపారం కావడం దురదృష్టకరం. చాలా మంది ఆ వ్యాపారం చేసి పెద్దలను, పిల్లలను చెడగొడుతున్నారు. డ్రగ్స్ నిర్మూలనపై సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి అందరం కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది.’

Cm Revanth Tollywood Stars Meet (Photo Credit : Google)
సినిమాల్లో డ్రగ్స్ సీన్ల పై ఏమంటారు?
‘మద్యం తాగడం, స్మోకింగ్ చేయడం ప్రాణాంతకం. డ్రగ్స్ కూడా అంతే. మారే వాడు మారతాడు. అయినప్పటికి వాటిని కంట్రోల్ చేయాల్సిన అసవరం ఉంది. ఈ విషయంలో ప్రజలను చైతన్యం చేయడం చాలా ఉపయోగపడుతుంది.’
చిన్న నిర్మాతలకు ఏం చేస్తే బాగుంటుంది?
‘సినిమా వాళ్లు చేసేది వ్యాపారం. మంచి సినిమాలు చేస్తే ఆడతాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అనే వ్యత్యాసం లేదు. మంచి సినిమా, చెడు సినిమా అనేది చూడాలి. మంచి సినిమా తీస్తే ఆడుతుంది. సినిమాను అమ్మడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఓటీటీలు, శాటిలైట్లు ఉన్నాయి. కథ బాగుండాలి, దాన్ని బాగా చెప్పగలగాలి’ అని నిర్మాత సురేష్ బాబు అభిప్రాయపడ్డారు.