Manmohan Singh : మన్మోహన్ సింగ్ పై సినిమా వచ్చింది తెలుసా? అందులో మన్మోహన్ పాత్రలో ఎవరు నటించారో తెలుసా?

మన్మోహన్ సింగ్ పై ఒక సినిమా కూడా వచ్చిందని మీకు తెలుసా?

Manmohan Singh : మన్మోహన్ సింగ్ పై సినిమా వచ్చింది తెలుసా? అందులో మన్మోహన్ పాత్రలో ఎవరు నటించారో తెలుసా?

Do You Know about Manmohan Singh Movie The Accidental Prime Minister Here Details

Updated On : December 27, 2024 / 2:55 PM IST

Manmohan Singh Movie : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) నిన్న రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అన్ని పార్టీల రాజకీయ నాయకులు, సినీ, క్రీడా పలు రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

మన్మోహన్ మరణంతో ఆయనకు సంబంధించిన విషయాలు, ఆయన దేశానికి చేసిన మంచి, ఆయన చేసిన ఆర్ధిక సంస్కరణల గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే మన్మోహన్ సింగ్ పై ఒక సినిమా కూడా వచ్చిందని మీకు తెలుసా? మన్మోహన్ సింగ్ పై ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే సినిమా 2019లో వచ్చింది.

Also Read : Sabhapathy : దర్శకుడు సభాపతి కన్నుమూత.. అసలు చిరంజీవి ‘అంజి’ సినిమా తీయాల్సింది ఈయనే..

ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమా విజయ్ రత్నాకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాని సంజయ్ బారు రాసిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పుస్తకం ఆధారంగా తీశారు. ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటించారు. సోనియా గాంధీ పాత్రలో సుజానే బెర్నాట్, రాహుల్ గాంధీ పాత్రలో అర్జున్ మథుర్ నటించారు. సినిమాలో అప్పటి రాజకీయ నాయకుల పాత్రలు చాలానే ఉన్నాయి.

అయితే ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పీఎం అయ్యే ముందు నుంచి అయిన తర్వాత సంఘటనలు, మన్మోహన్ విషయంలో కాంగ్రెస్ వైఖరి, మన్మోహన్ కంటే కూడా సోనియా, రాహుల్ నిర్ణయాలు తీసుకునేవారని, అనుకోకుండా ఈయన ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సి వచ్చింది అన్న పాయింట్ లో చూపించారు. దీంతో ఈ సినిమాపై కాంగ్రెస్ నుంచి విమర్శలు కూడా వచ్చాయి.

ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే నడిచింది. ఆల్మోస్ట్ 25 కోట్లు కలెక్ట్ చేసింది. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఈ సినిమా ఉందంటూ పలు వివాదాలలో కూడా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా చూడాలంటే జీ5 ఓటీటీలో, యూట్యూబ్ లో చూడొచ్చు.

Also Read : Manmohan Singh: మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? ఆయన ముగ్గురు కుమార్తెలు ఏం చేస్తున్నారంటే..

ఇక మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. శనివారం ఉదయం ఆయన పార్ధివ దేహాన్ని ఆయన ఇంటి నుంచి ప్రజల సందర్శనార్థం ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లనున్నారు. రాజ్ ఘాట్ సమీపంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.