Sabhapathy : దర్శకుడు సభాపతి కన్నుమూత.. అసలు చిరంజీవి ‘అంజి’ సినిమా తీయాల్సింది ఈయనే..
తాజాగా మరో సీనియర్ దర్శకుడు మరణించాడు.

Tamil Senior Director Sabhapathy Passed Away
Sabhapathy : గత నెల రోజులుగా సినీ పరిశ్రమలలో పలు మరణాలు సంభవించాయి. మలయాళ సీనియర్ నటి మీనా, హీరోయిన్ భాను శ్రీ మెహ్రా సోదరుడు, లెజెండరీ దర్శకుడు శ్యామ్ బెనగల్, మలయాళ రచయిత MT వాసుదేవన్ నాయర్.. ఇలా పలువురు మరణించారు. తాజాగా మరో సీనియర్ దర్శకుడు మరణించాడు.
Also Read : Allu Arjun Bail Petition : అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా..
ప్రముఖ తమిళ దర్శకుడు సభాపతి నిన్న రాత్రి మరణించారు. 61 ఏళ్ళ వయసులో ఆరోగ్య సమస్యలతో మరణించినట్టు సమాచారం. తమిళ్ తో పాటు తెలుగులో ఓ సినిమా, కన్నడలో ఓ సినిమా కూడా చేసారు. తమిళ్ లో 8 సినిమాలు డైరెక్టర్ గా చేసారు. ఈయన మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఈయనకు నివాళులు అర్పిస్తున్నారు.
2011లో చివరిగా జాలి బాయ్ అనే కన్నడ సినిమా తీసిన సభాపతే ఆ తర్వాత సినిమాలకుదూరంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి అంజి సినిమాకు మొదట సభాపతే దర్శకుడు. ఆ తర్వాత అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్టు కోడి రామకృష్ణ చేతికి వెళ్ళింది. సిమ్రాన్ ని ఈ దర్శకుడే సినీ పరిశ్రమకు పరిచయం చేసాడు. తెలుగులో జగపతిబాబుతో పందెం సినిమా తీసాడు. తమిళ్ లో ఈయన తీసిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి.
Also Read : Hari Hara Veera Mallu : అభిమానులకు పండగ..! కొత్త ఏడాది పవన్ గాత్రంతో గ్రాండ్ వెల్‌కమ్..!