Brahmanandam First Income while he Studying MA Telugu
Brahmanandam : దాదాపు వెయ్యికి పైగా సినిమాలతో మనల్ని నవ్వించి, ఇంకా నవ్విస్తున్న బ్రహ్మానందం, ఆయన కామెడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు ప్రేక్షకులు జీవితాంతం నవ్వుకునేలా చేసిన బ్రహ్మానందం మాత్రం చిన్నప్పుడు పేద కుటుంబం కావడంతో అనేక కష్టాలు పడ్డారు. ప్రస్తుతం బ్రహ్మానందం ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతూ అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఇక ఆయన చిత్రలేఖనం కళని కూడా బయటకి తీసి రకరకాల బొమ్మలు గీస్తున్నారు. ఇటీవల ఆయన ఆత్మకథని పుస్తక రూపంలో తీసుకొచ్చారు బ్రహ్మానందం.
‘నేను- మీ బ్రహ్మానందం’ అనే పేరుతో ఆయన ఆటోబయోగ్రఫీని ఆయనే స్వయంగా రాసారు. ఇటీవలే ఈ పుస్తకాన్ని చిరంజీవి విడుదల చేశారు. బ్రహ్మానందం గతంలో తెలుగు లెక్చరర్ కావడంతో ఆ స్వచ్ఛమైన తెలుగుని ఈ పుస్తకంలో ఉపయోగించారు. ఈ పుస్తకంలో చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలు, పేదరికం, వేరే వాళ్ళ సాయంతో తన చదువులు, సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చారు, తన ఫ్యామిలీ.. ఇలా అన్ని విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. ఎన్నో ఆసక్తికర, ఎవ్వరికి తెలియని విషయాలు ఈ పుస్తకంలో పంచుకున్నారు బ్రహ్మానందం.
ఇక తన చదువంతా ఎవరో ఒకరి సహాయంతో, తన ట్యాలెంట్ చూసి దయతలిచి అనసూయమ్మ లాంటి టీచర్లు, కొంతమంది చేసిన సహాయాలతో సాగింది అని నేను పుస్తకంలో తెలిపారు. స్కూల్ తర్వాత ఇంటర్, డిగ్రీ.. తనకు సహాయం చేసిన వాళ్ళ ఇళ్లల్లో చిన్న చిన్న పనులు చేసిపెడుతూ చదువుకున్నట్టు, డిగ్రీలోనే నాటకాలు, మిమిక్రి ప్రోగ్రామ్స్ ఇస్తూ చదువుకున్నట్టు తెలిపారు.
అయితే డిగ్రీ BA తెలుగు చదివాక MA పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి బ్రహ్మానందం దగ్గర డబ్బులు లేవు. అంతలోనే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ గుంటూరులో పీజీ సెంటర్ ఓపెన్ చేయడంతో అక్కడ సీటు కోసం ప్రయత్నించగా తన కళని, కామెడీని చూసి MA తెలుగులో ఫ్రీ సీట్ ఇచ్చారు. చదువుకోవడానికి సీట్ వచ్చింది కానీ అక్కడ హాస్టల్ లో ఉండి చదువుకోలంటే డబ్బులు కావాలి. అంత డబ్బులు లేక గుంటూరు వద్ద నల్లపాడులో చిన్న చిన్న గదులు కట్టి స్టూడెంట్స్ కోసం అద్దికిచ్చే చోట ఉంటూ అనసూయమ్మ గారు ఇచ్చే సహాయంతో చదువుకునేవారు. అయితే మొత్తం ఆవిడని అడగలేక తన భోజనానికి అయినా సంపాదించుకోవాలి అని ఏదో ఒక పని చేద్దాం అనుకున్నారు బ్రహ్మానందం.
నల్లపాడు రూమ్ నుంచి కాలేజీకి వెళ్లే దారిలో ఓ చోట లారీలు రిపేర్లు చేస్తూ పెయింట్స్ వేసే వాళ్ళు. అప్పటికే బ్రహ్మానందం బొమ్మలు గీసేవాడు. ఆ పెయింట్ పనేదో బాగుంది అనిపించి వెళ్లి పని ఏమన్నా ఉందా అని అడగడంతో సహాయకుడిగా చేరి కొన్ని రోజుల్లోనే తాను కూడా లారీలకు పెయింట్స్ వేసేవాడు. ఉదయం కాలేజీకి వెళ్లొచ్చి సాయంత్రం నుంచి పాత బట్టలు వేసుకొని లారీలకు పెయింట్స్ వేసేవాళ్ళు. అప్పుడు నెల జీతం కాకుండా వర్క్ బట్టి అయిదు రూపాయలు, నాలుగు రూపాయలు ఇచ్చేవారని బ్రహ్మానందం తన పుస్తకంలో తెలిపారు. 1970ల్లో ఆ డబ్బులు ఎక్కువే అని, వాటితో పాటు వేరే వాళ్ళు చదువుకోసం చేసిన సాయంతో రెండేళ్లు MA తెలుగు జాగ్రత్తగా చదువుకున్నట్టు తెలిపారు.
Also Read : Chiranjeevi : రచయితగా మారిన బ్రహ్మానందం.. బ్రహ్మి ఆత్మకథని లాంచ్ చేసిన మెగాస్టార్..
కష్టే ఫలి అంటారు. బ్రహ్మానందం అలా చదువుకునే రోజుల్లోనే అంతలా కష్టపడి చదివి జాబ్ సంపాదించి, మరో వైపు తనలోని కామెడీ యాంగిల్ కి నటనని జోడించి ఇప్పుడు ఇలా టాప్ కమెడియన్ గా ఎదిగారు.