Brahmanandam : ‘బ్రహ్మ ఆనందం’ ఫస్ట్ లుక్ రిలీజ్.. బ్రహ్మానందం అలా పట్టు పంచె కట్టి నడిచిస్తుంటే..

ఇటీవల బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా 'బ్రహ్మ ఆనందం' అనే సినిమాని ప్రకటించారు.

Brahmanandam : ‘బ్రహ్మ ఆనందం’ ఫస్ట్ లుక్ రిలీజ్.. బ్రహ్మానందం అలా పట్టు పంచె కట్టి నడిచిస్తుంటే..

Brahmanandam First Look Released from Raja Goutham Brahma Anandam Movie

Updated On : August 16, 2024 / 1:47 PM IST

Brahmanandam : బ్రహ్మానందం ఇటీవల అడపాదడపా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్న పాత్ర అయినా, చిన్న సినిమా అయినా తనకి నచ్చితేనే చేస్తున్నారు బ్రహ్మానందం. ఇటీవల బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా ‘బ్రహ్మ ఆనందం’ అనే సినిమాని ప్రకటించారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మాతగా కొత్త దర్శకుడు RVS నిఖిల్ దర్శకత్వంలో ఈ బ్రహ్మా ఆనందం సినిమాని తెరకెక్కిస్తున్నారు.

రాజా గౌతమ్ హీరోగా, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలో ఈ బ్రహ్మ ఆనందం తెరకెక్కిస్తుండగా ఇందులో బ్రహ్మానందం తన కొడుకుకి తాత పాత్రలో నటించబోతున్నట్టు ఇటీవల ఓ వీడియో ద్వారా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి బ్రహ్మానందం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో బ్రహ్మానందం పట్టు పంచె కట్టి కళ్ళజోడు పెట్టి అలా స్టయిలిష్ గా నడిచొస్తున్నట్టు ఉంది.

Brahmanandam First Look Released from Raja Goutham Brahma Anandam Movie

Also Read : Ram Charan : గ్లోబ‌ల్ స్టార్‌ రామ్‌ చరణ్‌పై ప్రశంసలు కురిపించిన ఫ్రెంచ్ హీరో

దీంతో బ్రహ్మానందం ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ గా మారింది. ఈ ఫస్ట్ లుక్ ని రాజా గౌతమ్ షేర్ చేసి.. బ్రహ్మానందంతో పనిచేయడం అద్భుతమైన అనుభవం అని అర్ధం వచ్చేలా పోస్ట్ చేసారు. ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయినట్టు సమాచారం. నిజ జీవితంలో తండ్రి కొడుకులు ఇప్పుడు సినిమాలో తాత మనవడిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.