Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించిన ఫ్రెంచ్ హీరో
భారతీయ చిత్ర స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ ఆర్ఆర్ఆర్.

French Actor Lucas Bravo Lauds Ram Charans Performance in RRR
Ram Charan : భారతీయ చిత్ర స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీతోనే రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పటికే రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లను పలువురు హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసించారు. తాజగా ఫ్రెంచ్ హీరో లూకాస్ బ్రావో కూడా రామ్‌చరణ్ నటనను ప్రశంసించారు. రామ్‌చరణ్ నటన అద్భుతం అని, ఎంట్రీ, ఎమోషనల్ సీన్లలో చాలా బాగా నటించారన్నారు.
ఎమిలీ ఇన్ పారిస్‌కు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భారతీయ సినిమాల్లో మీకు నచ్చిన నటుడు ఎవరు అనే ప్రశ్న లూకాస్‌కు ఎదురైంది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్‌లో ప్రధాన పాత్ర పోషించిన రామ్‌చరణ్ అద్భుత నటుడు అని చెప్పారు. ఎంట్రీ సీన్, ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగా నటించాడని చెప్పుకొచ్చారు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఆకట్టుకున్నారన్నారు.
Hari Hara Veera Mallu : షూటింగ్ మొదలుపెట్టిన ‘హరిహర వీరమల్లు’.. పవన్ ఎప్పుడు జాయిన్ అవుతాడంటే..?
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2022లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకదీరుడు డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. 1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అంతేనా అస్కార్ అవార్డు ను తెచ్చిపెట్టింది.
ఇదిలా ఉంటే.. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తున్నారు. కియారా అద్వాణి హీరోయిన్ కాగా అంజలి, శ్రీకాంత్, సునీల్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.