Brahmanandam : యంగ్ ఏజ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఉంటే.. ఏ స్టార్ మిగిలేవాడు కాదు..!

‘కామెడీ కింగ్’ బ్రహ్మానందం రేర్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Brahmanandam : యంగ్ ఏజ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఉంటే.. ఏ స్టార్ మిగిలేవాడు కాదు..!

Brahmanandam

Updated On : June 29, 2021 / 9:51 PM IST

Brahmanandam: బ్రహ్మానందం.. ఈ పేరు తెలియని తెలుగువారుండరు.. ‘అహ నా పెళ్లంట’ నుండి ‘అల.. వైకుంఠపురములో..’ వరకు 4 దశాబ్దాలకు పైగా తన మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్న నవ్వుల రారాజు, హ్యాస్యబ్రహ్మ, కామెడీ కింగ్, పద్మశ్రీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన బ్రహ్మానందం.. కాస్త అలసటగా ఉన్నా, మూడ్ బాగోలేకపోయినా బ్రహ్మానందం కామెడీ సీన్స్ చూస్తే అంతా సర్దుకుంటుంది అంటుంటారు చాలామంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండడానికి కొంతమంది బ్రహ్మీ ఫొటోను డీపీగా, స్క్రీన్ సేవర్‌గా పెట్టుకుంటుంటారంటే ఆయన కామెడీకున్న కిక్ అది.

సోషల్ మీడియాలో బ్రహ్మానందం ఎప్పుడూ హాట్ టాపిక్కే.. ఆయన అప్‌డేట్ ఎప్పుడూ వైరలే.. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రహ్మానందం మీద ఎన్నో మీమ్స్, ఎమోజీస్ వస్తుంటాయి. ఏదైనా కరెంట్ టాపిక్‌ను కనెక్ట్ అయ్యేలా చెప్పాలంటే బ్రహ్మీ మీమ్ ఒక్కటిచాలు.. ఇక ఈ కామెడీ కింగ్ ఎక్స్‌ప్రెషన్స్ గురించి కానీ రేర్ పిక్స్ గురించి కానీ, అవి క్రియేట్ చేసే సెన్సేషన్ గురించి కానీ కొత్తగా చెప్పక్కర్లేదు.. వాటిని యూజ్ చేసి నెటిజన్లు, మూవీ లవర్స్ చేసే ఆ రచ్చ వేరేలా ఉంటుంది.

Brahmanandam

ఇప్పుడలానే బ్రహ్మానందం రేర్ పిక్ ఒకటి పలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలలో తెగ వైరల్ అవుతోంది. బ్రహ్మీ టీనేజ్‌లో సినిమా కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్లలో తీసుకున్న పిక్ అది. సూట్‌లో నీట్‌గా, స్టైలిష్‌గా యంగ్ బ్రహ్మీ లుక్ కిరాక్ ఉంది. ఆ ఇమేజ్ చూస్తుంటే.. ‘నాయక్’ సినిమాలో పెళ్లి చూపులు సీన్ గుర్తొస్తుంది..

అదే ఫొటోకి గెడ్డం పెట్టి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, విజయ్ దేవరకొండ గెడ్డంతో ఉన్న పిక్స్ పెట్టి.. ‘Every One Is A Gangster.. Untill The Real Gangster Arrives’ అంటూ ఫ్యాన్స్ ఫన్నీగా మీమ్స్ చేశారు. అలాగే.. ‘ఆయన యంగ్ ఏజ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఉంటే.. ఏ స్టార్ మిగిలేవాడు కాదిక్కడ’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ ఫొటో ఒరిజినలా, కాదా అనేది పక్కన పెడితే.. కాసేపు హాయిగా నవ్వుకోవడం మాత్రం గ్యారెంటీ..

తన గురువు జంధ్యాల గారు చెప్పినట్టు.. ‘నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం..’ అంటూ తనదైన అచ్చతెలుగు హాస్యంతో తెలుగువారందరినీ నవ్విస్తున్న లాఫింగ్ క్లబ్ బ్రహ్మానందం.. ఈమధ్య సినిమాలు కాస్త తగ్గించారాయన. ప్రస్తుతం తనకిష్టమైన పెయింటింగ్స్ వేస్తూ, మనవడితో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు కామెడీ కింగ్ బ్రహ్మానందం..