Site icon 10TV Telugu

Gurram Paapi Reddy : ‘గుర్రం పాపిరెడ్డి’ టీజర్ రిలీజ్.. తెలుగు స్టార్ బ్రహ్మానందం, తమిళ్ స్టార్ యోగిబాబు ఒకే సినిమాలో..

Brahmanandam Yogi Babu Gurram Paapi Reddy Teaser Released

Gurram Paapi Reddy

Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సడ్డి, అమర్ బురా, జయకాంత్ నిర్మాణంలో డార్క్ కామెడీ కథతో మురళీ మనోహర్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం, యోగిబాబు, జీవన్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నేడు గుర్రం పాపిరెడ్డి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు.

మీరు కూడా గుర్రం పాపిరెడ్డి టీజర్ చూసేయండి..

 

Also See : Faria Abdullah : టీజర్ లాంచ్ ఈవెంట్లో ఫరియా అబ్దుల్లా క్యూట్ ఫొటోలు..

టీజర్ లాంచ్ ఈవెంట్లో బ్రహ్మానందం మాట్లాడుతూ.. గుర్రం పాపిరెడ్డి నాకొక స్పెషల్ మూవీ. ఎందుకంటే యంగ్ స్టర్స్ అంతా కలిసి ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో జడ్జి పాత్రలో నటించాను. తమిళ సినీ పరిశ్రమలో యోగిబాబుకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనకు తెలుసు. ఇటీవల యోగిబాబు హీరోగా నటించిన ఓ కన్నడ సినిమాలో నేను నటించాను. ఆయన బయట చాలా కామ్ గా ఉంటారు. ఈయన కామెడీ చేస్తారని అనుకోం. కానీ కామెడీని పండించడంలో దిట్ట అని అన్నారు.

యోగిబాబు మాట్లాడుతూ.. గుర్రం పాపిరెడ్డి సినిమా ద్వారా నేరుగా తెలుగు ఆడియెన్స్ ముందుకు రావడం హ్యాపీగా ఉంది. బ్రహ్మానందం గారితో కలిసి నటించడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. నేను చేసిన సార్ మేడమ్ సినిమాను తెలుగు ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారు. గుర్రం పాపిరెడ్డి సక్సెస్ మీట్ లో తప్పకుండా తెలుగులో మాట్లాడుతా అన్నారు.

నిర్మాత జయకాంత్ మాట్లాడుతూ.. తెలుగులో వస్తున్న డిఫెరంట్ డార్క్ కామెడీ సినిమా ఇది. సినిమా మొత్తం జాయ్ రైడ్ లా ఉంటుంది. బడ్జెట్ కొంచెం ఎక్కువైంది అని అన్నారు. నిర్మాత అమర్ బురా మాట్లాడుతూ.. మేము ఐటీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాం. సినిమా మేకింగ్ మీద ప్యాషన్ తో ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యాం అని తెలిపారు.

డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ.. నరేష్, ఫరియా నుంచి దాదాపు 9 మంది టాప్ ఆర్టిస్టులు ఈ మూవీకి కంప్లీట్ గా సపోర్ట్ చేశారు. వాళ్లందరి సపోర్ట్ వల్లే సినిమా అనుకున్నట్లుగా సరైన టైమ్ లో కంప్లీట్ చేశాం. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ద్వారానే కథ నెరేట్ అవుతుంది. ఆయన ద్వారానే ఈ పాత్రలన్నీ పరిచయం అవుతాయి అని తెలిపారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. ఈ సినిమాలో సౌధామిని అనే పాత్రలో నటించాను. ఈ సినిమా నేను ఒప్పుకునేందుకు నరేష్ అగస్త్య ఒక రీజన్. ఇలాంటి మంచి నటుడితో మూవీ చేయాలని అనిపించేది. మా మదర్ ఈ సినిమాలో చిన్న అతిథి పాత్రలో నటించింది అని తెలిపింది.

Also Read : Film Chamber : టాలీవుడ్ సమ్మె.. ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయాలు ఇవే.. ఇక నుంచి యూనియన్స్ తో సంబంధం లేకుండా..

నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను హీరో అంటున్నారు గానీ నేనొక్కడినే కాదు ప్రతి ఒక్క క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. బ్రహ్మానందం, యోగి బాబు గారి లాంటి స్టార్స్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది అన్నారు.

Exit mobile version