NTR’s Promo: ఎన్టీఆర్ ఎమోషనల్ ప్రోమో.. బుల్లితెరపై ఆగస్ట్‌లోనే!
చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలు హోస్ట్‌లుగా బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో గతంలో సందడి చేసిన ప్రోగ్రామ్.. ఇప్పుడు ఎన్టీఆర్ హోస్ట్‌గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Brand new promo of Young Tiger NTR
Young Tiger NTR’s Evaru Meelo Koteeswarlu: చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలు హోస్ట్‌లుగా బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో గతంలో సందడి చేసిన ప్రోగ్రామ్.. ఇప్పుడు ఎన్టీఆర్ హోస్ట్‌గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న షో జెమినీ టీవీలో ప్రసారానికి సిద్ధం అవుతోంది. దీనికి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
లేటెస్ట్‌గా ఈ షోకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ ప్రోమోను విడుదల చేశారు నిర్వాహకులు.. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఎన్టీఆర్ మాటలకు అభిమానులు మైమరిచిపోతుండగా.. ఆ మాటలు బుల్లితెర ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఎవరు మీలో కోటీశ్వరులు.. ఇక్కడ మనీ మాత్రమే కాదు.. మనసులు కూడా గెలుచుకోవచ్చు అని ఎమోషనల్ ప్రోమోను వదిలారు.
జీవితంలో ప్రతీఒక్కరికీ ఓ ఆశయం ఉంటుంది. అందులో అమ్మ కావాలని అనుకునే అమ్మాయి ఆశయం అంటూ ఆసక్తికరంగా రూపొందించారు. అసలు మీరు ఏం కావాలని అనుకుంటున్నారు అని తారక్ అడగగా.. అమ్మను కావాలని అనుకుంటున్నా అంటూ చెప్పే సమాధానం చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ఈ ప్రోమో ఈ వీడియోలో ”ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు. ఇక్కడ కథ మీది, కల మీది.. ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం.. ఎవరు మీలో కోటీశ్వరులు” అంటూ మనసుకు హత్తుకునే మాటలతో ఆకర్షించారు హోస్ట్ తారక్.
ఈ నెల (ఆగస్టు) లోనే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ప్రారంభం కానున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. రోరింగ్ దిస్ ఆగస్ట్ అంటూ ఈ నెలలో ప్రోగ్రామ్ సందడి చేయనున్నట్లు ప్రకటించారు.