కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’ : ఫస్ట్ లుక్

దీపావళి సందర్భంగా కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న రెండవ సినిమా.. ‘సూపర్ మచ్చి’.. ఫస్ట్ లుక్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : October 26, 2019 / 05:58 AM IST
కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’ : ఫస్ట్ లుక్

దీపావళి సందర్భంగా కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న రెండవ సినిమా.. ‘సూపర్ మచ్చి’.. ఫస్ట్ లుక్ రిలీజ్..

మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు ‘విజేత’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న రెండవ సినిమా.. ‘సూపర్ మచ్చి’.. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, పులి వాసుని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. రిజ్వాన్ నిర్మిస్తున్నారు.

దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రియా చక్రవర్తి హీరోయిన్.. థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. వర్షంలో తడుస్తూ ఫుల్ జోష్‌లో ఉన్న కళ్యాణ్ దేవ్ లుక్ ఆకట్టుకుంటుంది. 

Read Also : వెన్నులో వణుకుపుట్టించే ‘సైకో’ టీజర్

2020 వేసవిలో ‘సూపర్ మచ్చి’ విడుదల చేయనున్నారు.. మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, కో-ప్రొడ్యూసర్ : ఖుషీ.