Chiranjeevi: చిరంజీవితో భేటీ అయిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్..

టాలీవుడ్ గాడ్ ఫాదర్ చిరంజీవిని బ్రిటిష్ ఉన్నతాధికారి హైదరాబాద్ లోని చిరు ఇంటిలో కలిశారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గాను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గా వ్యవహరిస్తున్న "గారెత్ విన్ ఓవెన్" నేడు చిరుతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఓవెన్ నేరుగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు.

British Deputy High Commissioner met Chiranjeevi

Chiranjeevi: టాలీవుడ్ గాడ్ ఫాదర్ చిరంజీవిని బ్రిటిష్ ఉన్నతాధికారి హైదరాబాద్ లోని చిరు ఇంటిలో కలిశారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గాను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గా వ్యవహరిస్తున్న “గారెత్ విన్ ఓవెన్” నేడు చిరుతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఓవెన్ నేరుగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు.

Chiranjeevi : 4వేల మంది విద్యార్థులతో ‘వాల్తేరు వీరయ్య’ లుక్

“చిరంజీవి గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది. అంచలంచలుగా ఎదుగుతున్న టాలీవుడ్ సినీ పరిశ్రమకి, యూకే ప్రభుత్వం సహకారం అందించడంపై ఇద్దరం సుదీర్ఘంగా చర్చించుకున్నాము. అలాగే చిరంజీవి గారు నిర్వహించే సేవ కారిక్రమాలు, ముఖ్యంగా కోవిడ్ సమయంలో అయన అందించిన సేవలు అభినందనీయం.

ఇక చిరంజీవి గారు నాకు అద్భుతమైన ఆతిధ్యం ఇవ్వడమే కాదు, అయన చేతితో వేసిన స్టీమ్ దోస మరియు ఆవకాయ పచ్చడి నాకు మర్చిపోలేని అనుభూతిని అందజేశాయి. ఈ సందర్భాన్ని ఎప్పటికి మర్చిపోలేను. త్వరలోనే ఆయన నిర్వహించే రక్తదాన కారిక్రమంలో నేను భాగం పంచుకుంటా” అంటూ వ్యాఖ్యానించాడు. కాగా చిరు కూడా మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందంటూ రీ ట్వీట్ చేశాడు.