Bro Movie : బ్రో ఫస్ట్ సింగల్ రిలీజ్.. ‘మై డియర్ మార్కండేయ’ సాంగ్ అదుర్స్..
బ్రో ఫస్ట్ సింగల్ వచ్చేసింది. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాతో కలిసి పవన్ అండ్ సాయి ధరమ్ చిందులేసి..

Pawan Kalyan Bro movie first single My Dear Markandeya released
Bro Movie : సోషియో ఫాంటసీ నేపథ్యంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలయికలో వస్తున్న సినిమా ‘బ్రో’. తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సితం (Vinodaya Sitham) కి ఇది రీమేక్‌గా వస్తుంది. తమిళ్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సముద్రఖనినే రీమేక్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయ్యి మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ దగ్గర పడుతుండడంతో మూవీలోని సాంగ్స్ ని కూడా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.
Salaar : ఆగష్టులో సలార్ ట్రైలర్.. రెడీగా ఉండండి అంటూ అప్డేట్ ఇచ్చిన మూవీ టీం..
ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగల్ ని రిలీజ్ చేశారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ‘మై డియర్ మార్కండేయ’ అంటూ సాగే క్లబ్ సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. మామ అల్లుళ్ళు కలిసి బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) తో చిందులేసి అదరగొట్టేశారు. సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఒకసారి మీరు కూడా ఆ పాట వైపు ఒక లుక్ వేసేయండి.
Mega Heroes : ఆగష్టులో మెగా హీరోల సినిమా కార్నివాల్.. పవన్ అండ్ సాయి ధరమ్..
కాగా ఈ సినిమాలో పవన్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. గతంలో ‘గోపాల గోపాల’ సినిమాలో మోడరన్ శ్రీకృష్ణుడిగా కనిపించిన పవన్.. ఈ చిత్రంలో టైం అనే దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. పీపుల్ మేడి ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించాడు. ఈ సినిమాలో సాయి ధరమ్ కి జోడిగా కేతిక శర్మ (Ketika Sharma) నటిస్తుంది. జులై 28న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తుంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద మామ అల్లుళ్ళు ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి.