Abdul Mateen : కోట్లకు పడగలెత్తిన బ్రూనై సుల్తాన్ కొడుకు.. ఓ సామాన్యురాలిని పెళ్లాడుతున్నాడు.. పెళ్లికూతురు ఎవరంటే?

కోట్లకు పడగలెత్తిన బ్రూనై సుల్తాన్ కొడుకు.. తన తండ్రి ముఖ్య సలహాదారుల్లో ఒకరి మనవరాలిని పెళ్లాడుతున్నారు. అంతర్జాతీయ ప్రముఖులు హాజరవుతున్న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతోంది.

Abdul Mateen : కోట్లకు పడగలెత్తిన బ్రూనై సుల్తాన్ కొడుకు.. ఓ సామాన్యురాలిని పెళ్లాడుతున్నాడు.. పెళ్లికూతురు ఎవరంటే?

Abdul Mateen

Updated On : January 11, 2024 / 4:54 PM IST

Abdul Mateen : ఆసియాలోనే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్‌లలో ఒకరైన బ్రూనై సుల్తాన్ కొడుకు అబ్దుల్ మతీన్ ఒక సామాన్యురాలిని పెళ్లాడబోతున్నారు. బందర్ సెరి బెగవాన్‌లోని బంగారు గోపురం మసీదులో ఇస్లాం సంప్రదాయంలో వీరి వివాహం జరగనుంది.

Maldives-Lakshadweep Issue : భారత్ – మాల్దీవుల వివాదం వేళ.. భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన చైనా.. ఇజ్రాయెల్ అభ్యర్థన ఇదే..

మతీన్ (32) తండ్రి సుల్తాన్ హసనల్ బోల్కియా ప్రపంచంలోనే అత్యధిక కాలం పాలించిన చక్రవర్తి.. అంతేకాదు ఈ భూమి మీద అత్యంత ధనవంతుడిగా పేరుంది. కాగా మతీన్ వివాహమాడుతున్న వధువు యాంగ్ ములియా అనిషా (29) తన తండ్రి ముఖ్య సలహాదారుల్లో ఒకరి మనవరాలట. 1,788 గదుల ప్యాలెస్‌లో ఎంతో వేడుకగా వీరి వివాహం జరగబోతోంది. అంతర్జాతీయ స్ధాయి ప్రముఖులు వీరి వివాహానికి హాజరవుతున్నారు. 10 రోజుల పాటుగా కొనసాగుతున్న వీరి పెళ్లి వేడుకలు ఆదివారం క్లైమాక్స్‌కి చేరనున్నాయి.

ఆదివారం రాయల్ క్యారేజ్‌లో ప్రయాణిస్తూ జరిగే ఈ జంట ఊరేగింపు కోసం చాలామంది బ్రూనియన్లు వీధుల్లో వరసలో నిలబడాలని ప్లాన్ చేస్తున్నారట. 4,50,000 కలిగి ఉన్న బ్రూనై చిన్న దేశం.. అయినప్పటికీ అపారమైన చమురు నిల్వల ద్వారా సంపన్న దేశంగా ప్రసిద్ధి చెందింది.

Luxury Homes Sale : దేశంలో కేవలం 3 రోజుల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైన కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్లు.. ఎగబడి కొనేస్తున్న ఎన్ఆర్ఐలు!

ప్రస్తుతం మతీన్ సింహాసనాన్ని అధిరోహించే అవకాశం లేనప్పటికీ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మతీన్ బ్రిటన్ రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్‌హర్ట్స్‌లో ఆఫీసర్ క్యాడెట్‌గా పట్టభద్రుడయ్యారు. 2019 లో ఆగ్నేయ ఆసియా గేమ్స్‌లో పోలోలో తన దేశానికి ప్రాతినిధ్యం వహించారు. గతేడాది మేలో కింగ్ చార్లెస్, క్వీన్ కెమిల్లా పట్టాభిషేకానికి ..2022 ల క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు యువరాజు తన తండ్రితో కలిసి హాజరయ్యారు. వధువు అనిషా ఒక ఫ్యాషన్ బ్రాండ్‌ని కలిగి ఉండటంతో పాటు టూరిజం వ్యాపారంలో సహ భాగస్వామిగా ఉన్నారు. వీరిద్దరి వివాహం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Mateen (@tmski)