Luxury Homes Sale : దేశంలో కేవలం 3 రోజుల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైన కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్లు.. ఎగబడి కొనేస్తున్న ఎన్ఆర్ఐలు!
Luxury Homes Sale : ఇంకా నిర్మాణమే పూర్తి కాలేదు. అంతలోనే లగ్జరీ ఫ్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. కేవలం 3 రోజుల వ్యవధిలోనే 865 మిలియన్ డాలర్ల (రూ.7200కోట్లు) విలువైన 1,113 లగ్జరీ అపార్టమెంట్లను విక్రయించారు.

Rich Indians Lap Up 865 Million Dollars Luxury Homes In Gurugram In Just 3 Days
Luxury Homes Sale : ప్రస్తుతం దేశంలో లగ్జరీ హోమ్స్‌కు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. విలాసవంతమైన ఇళ్లను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భారతీయ ధనవంతులు ఈ లగ్జరీ అపార్టమెంట్లను కొనేందుకు ముందుకు వస్తున్నారు. కేవలం ఇళ్లు అంటే.. నివాసం ఉండేందుకు మాత్రమే కాదు.. అన్నిరకాలుగా సదుపాయాలు ఉండేలా చూసుకుంటున్నారు. అలాంటి విలాసవంతమైన ఇళ్లనే కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే భారత్‌లోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్ (DLF Ltd) ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో కోట్ల విలువైన రెసిడెన్షియల్ ప్రాజెక్టు మొదలుపెట్టింది.
25శాతం మంది ఎన్ఆర్ఐలే.. :
ఈ సరికొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టు ప్రీ-లాంచ్‌లో భాగంగా లగ్జరీ ఫ్లాట్లపై ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించడంతో ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ల నిర్మాణాన్ని ప్రారంభించక ముందే అన్ని లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను డీఎల్ఎఫ్ విక్రయించింది. గురుగ్రామ్‌లోని 865 మిలియన్ల డాలర్ల (సుమారు రూ. 7,200 కోట్లు) విలువైన 1,113 విలాసవంతమైన నివాసాలను కేవలం మూడు రోజుల్లోనే విక్రయించింది. అందులో ఒక వంతు ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) కొనుగోలు చేశారు. లగ్జరీ ఇళ్లను కొనేవారిలో 25శాతం మంది ఎన్‌ఆర్‌ఐలే ఉన్నారని డీఎల్ఎఫ్ పేర్కొంది.
Read Also : Luxury Homes: హైదరాబాద్‌లో లగ్జరీ గృహాలకు భారీ డిమాండ్.. 20 రెట్లు పెరిగిన విక్రయాలు
డీఎల్ఎఫ్ ప్రివానా సౌత్ ప్రాజెక్ట్‌లోని ఏడు టవర్లలో మొత్తం నాలుగు పడక గదులు, పెంట్‌హౌస్ యూనిట్లు అమ్ముడయ్యాయని డెవలపర్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. గురుగ్రామ్‌లో కొత్తగా నిర్మించనున్న ‘డీఎల్‌ఎఫ్ ప్రివానా సౌత్’ లగ్జరీ రెసిడెన్షియల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ప్రీ-లాంచ్ అయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ముందే విలాసవంతమైన అపార్టమెంట్లను విక్రయించినట్టు డీఎల్ఎఫ్ పేర్కొంది. ఆఫర్ ప్రకటించిన కేవలం 72 గంటల్లోనే కొనుగోలుదారులు ఈ లగ్జరీ ఫ్లాట్లను బుక్ చేసుకున్నారని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
1,113 లగ్జరీ హోమ్స్.. ఒక్కో ఫ్లాట్ బుకింగ్ ధర ఎంతంటే? :
మొత్తం 25 ఎకరాల్లో ఈ లగ్జరీ ఫ్లాట్లను డీఎల్ఎఫ్ నిర్మించనుంది. ఏడు టవర్లలో 1,113 లగ్జరీ హోమ్స్ నిర్మించనున్నట్లు రియల్టీ దిగ్గజం తెలిపింది. ఒక్కో ఫ్లాట్ బుకింగ్ ధర రూ.50 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. బల్క్ ఫ్లాట్స్ బుకింగ్ కాకుండా ఒక ఫ్లాట్‌ను మాత్రమే బుక్ చేసుకునేందుకు వీలుంది. గూగుల్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌తో సహా మల్టీ నేషనల్ కంపెనీలకు నిలయమైన శాటిలైట్ సిటీలో 116 ఎకరాల్లో అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ విస్తరించి ఉంది. డీఎల్ఎఫ్ షేర్లు గత సంవత్సరంలో రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగాయి. 2008 నుంచి అత్యధిక స్థాయికి బెంచ్‌మార్క్ బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్‌లో 18శాతం పెరుగుదలను అధిగమించింది.

Rich Indians Luxury Homes In Gurugram
హైదరాబాద్ సహా పలు నగరాల్లో మరిన్ని ప్రాజెక్టులు :
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటిగా ఉంది. దేశంలో విలాసవంతమైన కార్ల నుంచి ఖరీదైన గృహాల వరకు ప్రతిదానికీ ఫుల్ డిమాండ్ పెరిగింది. దీనికి తగినట్టుగానే ఖరీదైన అపార్ట్‌మెంట్‌లు కొనుగోలు చేసేందుకు భారతీయ ధనవంతులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రీమియం అపార్ట్‌మెంట్‌లకు డిమాండ్ పెరగడంతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లోని పలు నగరాల్లో ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లగ్జరీ బూమ్ మరో రెండేళ్ల పాటు కొనసాగుతుందని రియల్ ఎస్టేట్ బ్రోకర్, కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులామ్ జియా తెలిపారు.
ధనికులు మాత్రమే కాదు.. ఎగువ మధ్యతరగతి వాళ్లు కూడా ఈ ప్రాజెక్టులను కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాదిలో డీఎల్ఎఫ్ కేవలం మూడు రోజుల్లో 1 బిలియన్ డాలర్ల విలువైన 1,100 అపార్ట్‌మెంట్‌లను విక్రయించింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్, మరో టాప్ డెవలపర్, రాజధాని సమీపంలోని ప్రాజెక్ట్‌లలో 500 మిలియన్ల డాలర్ల కన్నా ఎక్కువ విలువైన విలాసవంతమైన ఫ్లాట్లను విక్రయించింది. అంతేకాదు.. మరిన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను కూడా ప్రకటించింది.
Read Also : Wellness Homes: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో కొత్త పోకడలు.. వెల్‌నెస్ హోమ్స్ కు పెరిగిన డిమాండ్