Bunny Vas : మన యూనిటీ ఎలా ఉంది..? పవన్ కళ్యాణ్ లేఖపై స్పందించిన గీత ఆర్ట్స్ నిర్మాత.. ట్వీట్ వైరల్..

తాజాగా గీత ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాసు దీనిపై స్పందిస్తూ వేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Bunny Vas Reacts on Pawan Kalyan Letter about Theaters Issues

Bunny Vas : గత కొన్ని రోజులుగా థియేటర్స్ సమస్య నిర్మాతలు – ఎగ్జిబిటర్ల మధ్య సాగుతుంది. ఈ వివాదాలు టాలీవుడ్ లో పెద్ద సమస్యగానే మారింది. అయితే ఇది హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ని టార్గెట్ పెట్టుకొనే జరుగుతుందని వార్తలు రావడం, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పై, ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఈ థియేటర్ల సమస్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళింది.

దాంతో డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి తెలుగు సినీ పరిశ్రమకు, థియేటర్స్ కు సీరియస్ గా ఒక లెటర్ ని విడుదల చేసారు పవన్. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమపై కౌంటర్లు వేయడం, సినిమా వాళ్ళు గవర్నమెంట్ ని అధికారికంగా కలవట్లేదు అని, ఇకపై డైరెక్ట్ గా ఎవరూ రావద్దు అని చెప్తూనే ఘాటుగా రాసారు లెటర్. అలాగే థియేటర్స్ ఆదాయం లెక్కలు, మల్టీప్లెక్స్ ల గురించి ప్రస్తావించారు.

Also Read : Nishabdha Prema : ‘నిశ్శబ్ద ప్రేమ’ మూవీ రివ్యూ.. లవ్ సస్పెన్స్ థ్రిల్లర్..

దీంతో ఈ థియేటర్స్ ఇష్యూ కాస్త టాలీవుడ్ లో పెద్ద చర్చగా మారింది. ఏకంగా సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇలా ఫైర్ అవ్వడంతో టాలీవుడ్ నిర్మాతలు అంతా ఆలోచనలో పడ్డారు. తాజాగా గీత ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాసు దీనిపై స్పందిస్తూ వేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

బన్నీ వాసు తన ట్వీట్ లో.. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్ గా ఉంటాయి.. అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే.. ప్రొడ్యూసర్స్ గానీ.. డిస్ట్రిబ్యూటర్స్ కానీ.. ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం అయిన వాళ్ళనే మనం ఇరిటేట్ చేసామంటే.. మన యూనిటీ ఎలా ఉంది అని ప్రశ్నించుకునే సమయం వచ్చింది అని రాసుకొచ్చారు. దీంతో బన్నీ వాసు ట్వీట్ కూడా వైరల్ గా మారింది. మరి పవన్ లేఖపై టాలీవుడ్ నుంచి ఇంకెవరు స్పందిస్తారో చూడాలి.

Also Read : Manchu Manoj : ఒక్కడు చేసిన తప్పుకు అందర్నీ అనడం కరెక్ట్ కాదు.. ‘కన్నప్ప’ హిట్ అవ్వాలి.. మూవీ యూనిట్ కి సారీ..