Manchu Manoj : ఒక్కడు చేసిన తప్పుకు అందర్నీ అనడం కరెక్ట్ కాదు.. ‘కన్నప్ప’ హిట్ అవ్వాలి.. మూవీ యూనిట్ కి సారీ..
మంచు విష్ణు కన్నప్ప సినిమాలో శివయ్య అనే డైలాగ్ బాగా ట్రోల్ అయిన సంగతి తెలిసిందే.

Manchu Manoj says sorry to Kannappa Movie Unit
Manchu Manoj : గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలిలో వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ వివాదాలతో మంచు ఫ్యామిలీ రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో మంచు విష్ణు – మంచు మనోజ్ ఒకరిపై ఒకరు మీడియా ముందు కౌంటర్లు వేస్తున్నారు. మనోజ్ అయితే ఎక్కడ దొరికితే అక్కడ ఇండైరెక్ట్ గా విష్ణు మీద, కన్నప్ప సినిమా మీద కౌంటర్లు వేస్తూనే ఉన్నాడు.
మంచు విష్ణు కన్నప్ప సినిమాలో శివయ్య అనే డైలాగ్ బాగా ట్రోల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో మనోజ్ ఈ శివయ్య డైలాగ్ ని పట్టుకొని పలు మార్లు సినిమా ఈవెంట్స్ లో విష్ణు ని ట్రోల్ చేసాడు. ఇటీవల భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా శివయ్య అంటూ సరదాగా కౌంటర్ వేసాడు మనోజ్.
Also Read : Shashtipoorthi : రాజేంద్ర ప్రసాద్, అర్చనల ‘షష్టిపూర్తి’.. ట్రైలర్ వచ్చేసింది..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు మనోజ్ మాట్లాడుతూ.. శివయ్య అంటూ నేను అనడం అది తప్పే. ఒక సినిమా కోసం అంతమంది కలిసి కష్టపడతారు. ఒక్కడు చేసిన తప్పుకు సినిమాని అలా అనడం తప్పు. ఆ సినిమా కోసం పనిచేసిన అందరికి, ఆ సినిమాలో నటించిన వారి ఫ్యాన్స్ కి, మూవీ టీమ్ కి అందరికి సారీ. ఆ కామెంట్ మరోసారి చేయను. కన్నప్ప కూడా పెద్ద హిట్ అవ్వాలి అని అన్నారు.