Nishabdha Prema : ‘నిశ్శబ్ద ప్రేమ’ మూవీ రివ్యూ.. లవ్ సస్పెన్స్ థ్రిల్లర్..

నిశ్శబ్ద ప్రేమ సినిమా నిన్న మే 23న రిలీజయింది.

Nishabdha Prema : ‘నిశ్శబ్ద ప్రేమ’ మూవీ రివ్యూ.. లవ్ సస్పెన్స్ థ్రిల్లర్..

Sriram Priyanka Thimmesh Nishabdha Prema Movie Review and Rating

Updated On : May 24, 2025 / 9:08 PM IST

Nishabdha Prema Movie Review : శ్రీరామ్, ప్రియాంక తిమ్మేష్ జంటగా తెరకెక్కిన సినిమా ‘నిశ్శబ్ద ప్రేమ’. హరీశ్ పెరడి, వియాన్, నిహారిక పాత్రో.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. సెలెబ్రైట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కార్తికేయన్. ఎస్ నిర్మాణంలో రాజ్ దేవ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నిశ్శబ్ద ప్రేమ సినిమా నిన్న మే 23న రిలీజయింది.

కథ విషయానికొస్తే.. సంధ్య (ప్రియాంక తిమ్మేష్)ను ఓ ముసుగు మనిషి వెంబడిస్తూ చంపే ప్రయత్నం చేస్తుండగా ఆమె తప్పించుకుని పరుగెడుతుండగా యాక్సిడెంట్ అవుతుంది. దాంతో సంధ్యను రఘు అనే వ్యక్తి హాస్పిటల్‌లో చేర్చి ట్రీట్‌మెంట్ ఇప్పించగా ఆమె తలకు తగిలిన దెబ్బ వల్ల గతం మర్చిపోయిందని తెలుస్తుంది. దీంతో రఘు తన భర్త అని పరిచయం చేసుకొని ఆమెతోనే ఉంటాడు. ఈ క్రమంలో సంధ్య ఓ పాత డైరీని చదవడంతో తనతో ఉన్న భర్త రఘు కాదని, విఘ్నేష్(శ్రీరామ్) అని తెలుస్తుంది. అదే సమయంలో తన భార్య సంధ్య కనిపించడం లేదంటూ రఘు (వియాన్) పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు.

కమీషనర్ అడ్వర్డ్ (హరీశ్ పెరడి) ఈ కేసు విచారించడంతో సంధ్య ఓ కిల్లర్ దగ్గర ఉందని తెలుస్తోంది. అసలు సంధ్యను విఘ్నేష్ ఎందుకు భార్యగా తీసుకెళ్లాడు? సంధ్య ఎలా అతని నుంచి తప్పించుకుంది? విఘ్నేష్ ఎవరు? రఘు ఎవరు? సంధ్యని చంపాలనుకున్నది ఎవరు? కిల్లర్ ఎవరు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Oka Brundavanam : ‘ఒక బృందావనం’ మూవీ రివ్యూ.. హృదయాన్ని హత్తుకునే సినిమా..

సినిమా విశ్లేషణ.. ఫస్ట్ హాఫ్ లో పాత్రల పరిచయం కోసం కాస్త సాగదీసినా అసలు కథ మొదలైన దగ్గర్నుంచి ఆసక్తిగా సాగుతుంది. అయితే సంధ్యని చంపాలనుకున్నది ఎవరు అనేది సినిమా మధ్యలోనే మనకు తెలిసిపోయినా అతను ఎలా బయటకు వస్తాడు? అతన్ని ఎవరు కనిపెడతారు? అనేది థ్రిల్లింగ్ గా సాగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో ట్విస్ట్ లు చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలు ట్విస్ట్ లు బాగానే వర్కౌట్ అయ్యాయి.

క్లైమాక్స్ కూడా పర్ఫెక్ట్ గా రాసుకున్నారు. శ్రీరామ్ పాత్ర చెప్పే డైలాగ్స్‌తో టైటిల్ జస్టిఫికేషన్ కూడా ఇచ్చాడు దర్శకుడు. సీరియల్ కిల్లింగ్, ప్రేమ, వైఫ్ & హస్బెండ్ ఎమోషన్ తో సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఆసక్తిగా తెరకెక్కించారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్ళు ఈ సినిమాని చూసేయొచ్చు.

sriram

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఒకప్పుడు హీరోగా పలు హిట్ సినిమాలతో మెప్పించిన శ్రీరామ్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. మరోసారి మెయిన్ లీడ్ లో శ్రీరామ్ డిఫరెంట్ షేడ్స్ లో తన నటనతో మెప్పించాడు. ప్రియాంక తిమ్మేష్ పైనే సినిమా అంతా నడుస్తుంది. ఆమె మంచి ఎమోషన్ ని పండించింది. మరో కీలక పాత్రలో నటించిన నిహారిక పాత్రో హాట్ హాట్ గా అలరిస్తుంది. వియాన్, హరీశ్ పెరడి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : Shashtipoorthi : రాజేంద్ర ప్రసాద్, అర్చనల ‘షష్టిపూర్తి’.. ట్రైలర్ వచ్చేసింది..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. పాటలు ఓకే అనిపిస్తాయి. కాస్త సాగదీసిన సీన్స్ ఎడిటింగ్ చేస్తే బాగుండేది. సస్పెన్స్ థ్రిల్లింగ్ లో కొత్త కథని తీసుకొని రెగ్యులర్ కథనంతోనే ఆసక్తిగా తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘నిశ్శబ్ద ప్రేమ’ సస్పెన్స్ థ్రిల్లర్ తో సాగుతూనే ఒక మంచి ఎమోషన్ ఉన్న సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.