Bunny Vasu
Bunny Vasu : పైరసీ సినీ పరిశ్రమకు కోట్లల్లో నష్టం కలిగిస్తున్న తెలిసిందే. ఇటీవల మూవీ పైరసీ సైట్ ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేసి ఆ సైట్ ని క్లోజ్ చేయించారు. తాజాగా నిర్మాత బన్నీ వాసు ఐ బొమ్మ క్లోజ్ అవ్వడం వల్లే రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు కలెక్షన్స్ పెరిగాయని అన్నారు.(Bunny Vasu)
అఖిల్, తేజస్వి జంటగా తెరకెక్కిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఇటీవల రిలీజయి మంచి విజయం సాధించింది. చాలా చిన్న బడ్జెట్ తో తీసిన ఈ సినిమా యిప్పటికే 7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ప్రాఫిట్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో రాజు వెడ్స్ రాంబాయి సినిమాని థియేట్రికల్ రిలీజ్ చేసిన బన్నీ వాసు, వంశీ నందిపాటి మీడియాతో మాట్లాడారు.
Also Read : Meena Kumari : పెళ్లయినా ధర్మేంద్రని ప్రేమించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. రివెంజ్ తీర్చుకున్న భర్త..
బన్నీ వాసు మాట్లాడుతూ.. ఈ సినిమా నైజాంలో పెద్ద హిట్ అవుతుంది అని ముందు నుంచి అందరం నమ్మాము. అనుకున్నట్టే నైజాంలో కలెక్షన్స్ వస్తున్నాయి. మూడు రోజుల్లోనే కేవలం నైజాంలో 5 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. ఇప్పుడు కూడా బుకింగ్స్ బాగున్నాయి. మల్టిప్లెక్స్ ల కాంట్ సింగిల్ స్క్రీన్స్ బుకింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఏపీలో కూడా మెల్లిగా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మా సినిమాకు కేవలం 100 రూపాయలు టికెట్ పెట్టడం బాగా కలిసొచ్చింది. తక్కువ టికెట్ రేటు ఉండటంతో జనాలు వస్తున్నారు అలాగే ఇదే సమయంలో ఐ బొమ్మ క్లోజ్ అవ్వడం కూడా మాకు కలిసొచ్చింది. పైరసీ లేకపోవడం, సినిమా టికెట్ ధర తక్కువ ఉండటంతో జనాలు థియేటర్ కి వస్తున్నారు. గతంలో తండేల్ సినిమా సమయంలో మొదటి మూడు రోజులు కలెక్షన్స్ బాగున్నా పైరసీ వచ్చాక తగ్గాయి. పైరసీ మాకు బాగా ఎఫెక్ట్ అయింది అని తెలిపారు.
దీంతో రాజు వెడ్స్ రాంబాయి సినిమా హిట్ అవ్వడానికి టికెట్ రేటు తక్కువ ఉండటం, సినిమా బాగుండటంతో పాటు ఐ బొమ్మ కూడా క్లోజ్ అవ్వడం కారణాలు అని బన్నీ వాసు చెప్పుకొచ్చారు.
మరో నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ.. మేము పెట్టిన పెట్టుబడికి నాలుగు రెట్ల లాభం వస్తుంది. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఇంకా స్క్రీన్స్ యాడ్ చేశాం. బీ, సీ సెంటర్స్ లో కలెక్షన్స్ బాగున్నాయి. 99 రూపాయల టికెట్ రేట్ పెట్టడం, ఐ బొమ్మ క్లోజ్ కావడం మా సినిమాకు కలిసి వచ్చింది. ఐ బొమ్మలో పైరసీ మూవీస్ చూసేవాళ్లు ఎక్కువగా బీ, సీ సెంటర్స్ వాళ్లే. ఇప్పుడు ఆ సైట్ క్లోజ్ కావడం వల్ల వాళ్లు థియేటర్స్ కు వస్తున్నారు అని తెలిపారు. దీంతో బన్నీ వాసు, వంశీ నందిపాటి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.