×
Ad

Allu Arjun : అల్లు అర్జున్ నెక్స్ట్ నాలుగు సినిమాలు ఫిక్స్.. బన్నీ వాసు క్లారిటీ..

అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలపై కూడా అంచనాలు నెలకొన్నాయి. (Allu Arjun)

Allu Arjun

Allu Arjun : పుష్ప సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఇండియా అంతా బన్నీ కి మంచి ఫేమ్ ఉంది. పుష్ప 2 కూడా భారీ హిట్ అవ్వడంతో నెక్స్ట్ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నితో సినిమాలు తీయడానికి పాన్ ఇండియా డైరెక్టర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.(Allu Arjun)

ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. 800 కోట్లతో భారీగా సైఫై కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. అలాగే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలపై కూడా అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Vijaya Bhaskar : పాపం డైరెక్టర్ ని పక్కన పెట్టేశారా..? నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్ ప్రమోషన్స్..

తాజాగా నిర్మాత, అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ బన్నీ వాసు అల్లు అర్జున్ సినిమాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ వి నాలుగు ప్రాజెక్ట్స్ ఫిక్స్ అయ్యాయి. నెక్స్ట్ నాలుగు సినిమాలు ఏంటి అనేది ఆయనకు క్లారిటీ ఉంది. త్రివిక్రమ్ – బన్నీ సినిమా చాలా అంశాల మీద ఆధారపడి ఉంది. దానిపై త్వరలో క్లారిటీ వస్తుంది. లోకేష్ కనగరాజ్ సినిమా గురించి నిర్మాతలే చెప్తారు అని తెలిపారు.

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా చేస్తుండగా, సందీప్ రెడ్డి వంగ సినిమా అధికారికంగానే ప్రకటించారు. ఈ రెండు సినిమాలు కాకుండా త్రివిక్రమ్ తో సినిమా కూడా అనౌన్స్ చేసారు కానీ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ లేదు. ఇక లోకేష్ కనగరాజ్ పేరు మాత్రం కొత్తగా వినిపిస్తుంది. దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ నాలుగు సినిమాలు అట్లీ, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ, లోకేష్ కనగరాజ్ లతో ఉంటుందని టాక్ నడుస్తుంది.

Also Read : Anvesh : యూట్యూబర్ అన్వేష్ కి షాక్.. పోలీస్ స్టేషన్ లలో వరుస ఫిర్యాదులు..