Anvesh : యూట్యూబర్ అన్వేష్ కి షాక్.. పోలీస్ స్టేషన్ లలో వరుస ఫిర్యాదులు..
కొన్ని లక్షల మంది అతని యూట్యూబ్ ఛానల్, అతని సోషల్ మీడియా ని అన్ ఫాలో చేసారు. (Anvesh)
Anvesh
Anvesh : ప్రపంచ దేశాలు తిరుగుతూ ఆయా దేశాలను చూపిస్తూ యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటూ ఫేమ్ తెచ్చుకున్నాడు అన్వేష్. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ తో వైరల్ అయ్యాడు. అయితే ఇటీవల హిందూ దేవతలపై, హిందువులపై, భారతదేశంపై పలు నెగిటివ్ కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా అతనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.(Anvesh)
హిందువులు కొన్ని లక్షల మంది అతని యూట్యూబ్ ఛానల్, అతని సోషల్ మీడియా ని అన్ ఫాలో చేసారు. దెబ్బకు అన్వేష్ క్షమాపణలు చెప్తూ వీడియో పోస్ట్ చేసాడు. అయితే అన్వేష్ హిందూ దేవి దేవతలపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్స్ లో అతనిపై ఫిర్యాదులు నమోదవుతున్నాయి.
Also Read : Pawan Kalyan : ఆ సినిమాకు తీసుకున్న 5 కోట్లు రైతులకు ఇచ్చేసాను.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్..
దేవతలను దూషించినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో యూట్యూబర్ అన్వేష్ పై సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేసింది. కళ్యాణి ఫిర్యాదు తో 352,79,299 BNS SEC 67IT ACT కింద యూట్యూబర్ అన్వేష్ పై కేసు నమోదు చేసారు. త్వరలో అన్వేష్ కి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు.
అలాగే అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పై తెలంగాణలో వరస పిర్యాదులు వస్తున్నాయి. అతన్ని భారత దేశానికి రప్పించి అరెస్ట్ చేయాలని, దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read : Nayanthara : నయనతార ‘టాక్సిక్’ లుక్.. మరోసారి స్టైలిష్ గా..
