Pawan Kalyan : ఆ సినిమాకు తీసుకున్న 5 కోట్లు రైతులకు ఇచ్చేసాను.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్..

గతంలో 2022లో పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. (Pawan Kalyan)

Pawan Kalyan : ఆ సినిమాకు తీసుకున్న 5 కోట్లు రైతులకు ఇచ్చేసాను.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్..

Pawan Kalyan

Updated On : December 31, 2025 / 11:25 AM IST

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకోవడంతో మంత్రిగా గ్రామాలను అభివృద్ధి చేస్తూ మారు మూల గ్రామాలకు కూడా రోడ్లు, కరెంట్, నీళ్లు రప్పిస్తూ అధికారులను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. పవన్ గతంలో అధికారంలో లేకపోయినా ఎంతోమందికి సేవ చేసిన సంగతి తెలిసిందే.(Pawan Kalyan)

పవన్ మొదట్నుంచి కూడా తన సొంత డబ్బును రైతులకు, కష్టాల్లో ఉన్నవాళ్లకు దానం చేసారు. జనసేన పార్టీ తరపున కూడా ఎంతోమందికి కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడ్డారు. గతంలో 2022లో పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర అని నిర్వహించి నష్టపోయిన రైతులకు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కలిపి కొన్ని వందల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున సాయం అందించారు.

Also Read : Nayanthara : నయనతార ‘టాక్సిక్’ లుక్.. మరోసారి స్టైలిష్ గా..

తాజాగా పవన్ కళ్యాణ్ అధికారులతో నిర్వహించిన మీటింగ్ లో మాట్లాడుతూ.. ఒక రోజు మనోహర్ కౌలు రైతులు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు అని వార్త చూపిస్తే మనం ఏదో ఒకటి చేయాలి అనుకున్నాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. కానీ దానికంటే ముందు ఆ రైతులకు భరోసా కలిపించాలి. ఎంతో కొంత డబ్బులు ఇస్తే వాళ్లకు ఉపయోగపడుతుంది అన్నాను. అప్పుడే నేను ఒక సినిమాకు సైన్ చేస్తే వచ్చిన అడ్వాన్స్ 5 కోట్లు ఆ రైతులకు ఇచ్చేసాను. ఇంకొంతమంది దాతలు కూడా ఇచ్చిన డబ్బులు కలిపి రైతులకు ఇచ్చాను అని తెలిపారు.

2022 లో పవన్ సైన్ చేసిన సినిమా అంటే OG నే అని, OG సినిమాకు అడ్వాన్స్ గా తీసుకున్న 5 కోట్లు పవన్ రైతులకు ఇచ్చేసాడు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి ఫ్యాన్స్, జనాలు పవన్ ని అభినందిస్తున్నారు.

Also Read : Trivikram Srinivas : నేను సినిమాలకు పనికి రానేమో.. మా అమ్మ ఒళ్ళో తల పెట్టి బాధపడ్డా.. త్రివిక్రమ్ కామెంట్స్ వైరల్..