Bunny Vasu : మా అందరికి బలుపు పెరిగిందా? మేము చూసుకోవట్లేదా.. బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు..

లిటిల్ హార్ట్స్ థ్యాంక్యూ మీట్ లో బన్నీ వాసు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. (Bunny Vasu)

Bunny Vasu

Bunny Vasu : ఇటీవల సినిమాలకు బడ్జెట్స్ తెగ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం, హీరోయిన్స్, వాళ్ళ స్టాఫ్ కి ఎక్కువ ఖర్చుపెట్టేయడం, హీరోలకు రెమ్యునరేషన్స్ పెంచేయడం.. అక్కర్లేని ఖర్చులతో సినిమా బడ్జెట్ లని పెంచేస్తున్నారు. ఇటీవల 5 కోట్ల లోపు సినిమాలు రావడం కూడా లేదు. పోనీ అంత బడ్జెట్ లు పెట్టి సినిమాలు తీస్తే అవి హిట్ అవుతాయా అన్న నమ్మకం కూడా లేదు.(Bunny Vasu)

దీనిపై నిర్మాతలు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి, సినిమా బడ్జెట్ లు తగ్గించుకోవాలి అనుకుంటున్నారు కానీ అవ్వట్లేదు. ఇలాంటి సమయంలో కేవలం 2.45 కోట్లతో తెరకెక్కించిన లిటిల్ హార్ట్స్ సినిమా రిలీజయి హిట్ కొట్టి ఏకంగా 22 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా దూసుకెళ్తుంది. కానీ సినిమా విజువల్స్ చూస్తే ఏ 10 కోట్లో పెట్టారు అనిపిస్తుంది. ఈ సినిమాని బన్నీ వాసు థియేటర్స్ లో రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా థ్యాంక్యూ మీట్ నిర్వహించారు.

Also Read : Telusu Kada : ‘తెలుసు కదా’ టీజర్ రిలీజ్.. ఇద్దరమ్మాయిలతో సిద్దు జొన్నలగడ్డ రొమాన్స్..

లిటిల్ హార్ట్స్ థ్యాంక్యూ మీట్ లో బన్నీ వాసు మాట్లాడుతూ.. 2.45 కోట్లలో ఈ సినిమా తీశారంటే నేను కూడా వీళ్ళ దగ్గర చాలా నేర్చుకోవాలి. ఇంత మంచి అవుట్ పుట్ 2.45 కోట్లలో తీశారంటే గ్రేట్. మేము తీయలేకపోతున్నాము. మేము నిజంగా అలా తీయలేకపోతున్నాము. 2.45 కోట్లు అంటే మాకు ఒక షెడ్యూల్ కి అవుతుంది. మా అందరికి కూడా అనుభవం పెరిగి బలుపు పెరిగిందా లేదంటే అనుభవం ఎక్కువ వచ్చేసి చూసుకోవట్లేదా మాకు తెలియట్లేదు. అసలు 2.45 కోట్లలో ఫైనల్ కాపీ తో సహా ఈ సినిమాని ఫినిష్ చేయడం రియల్లీ హ్యాపీ మీ అందర్నీ అభినందిస్తున్నాను అని అన్నారు.

ఇలా టాలీవుడ్ నిర్మాతలని, తనని కూడా కలుపుకొని బడ్జెట్స్ తగ్గించుకొని సినిమాలు చేయలేకపోతున్నామని డైరెక్ట్ గానే కామెంట్స్ చేయడంతో బన్నీ వాసు వ్యాఖ్యలు టాలీవుడ్ లో వైరల్ గా మారాయి.

Also Read : Mirai Pre Release Business : రేపే తేజ సజ్జా ‘మిరాయ్‌’ రిలీజ్.. ఎంత ఖర్చుపెట్టారు? హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి?

లిటిల్ హార్ట్స్ థ్యాంక్యూ మీట్ లో బన్నీ వాసు ఫుల్ స్పీచ్..