బుట్టబొమ్మ సాంగ్ ప్రోమో..అల్లు అర్జున్ స్టెప్స్ అదుర్స్

టాలీవుడ్‌లో స్టైల్‌ను ట్రెడింగ్ సెట్ చేసి..స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు పొందిన నటుడు అల్లు అర్జున్. ఇతని సినిమాలో స్టెప్స్, స్టైల్ చూడటానికి అభిమానులతో పాటు ఇతరులు ఉత్సాహం చూపుతుంటారు. ఒక్కో సినిమాలో ఒక్కో లుక్, డ్యాన్సుల్లో డిఫరెంట్ స్టెప్స్‌తో అదరగొడుతున్న ఈ హీరో న్యూ ఫిల్మ్..అల వైకుంఠపురం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే..ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ కస్టర్ ఇటీవలే అట్టహాసంగా జరిగింది. అందులో రాములో..రాముల పాటకు బన్నీ స్టెప్స్ వేసి అభిమానులు ఉత్సాహపరిచారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి బుట్టబొమ్మ పాటకు సంబంధించి టీజర్‌ను విడుదల చేశారు. ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇంత సుందరమైన పాటకు మ్యూజిక్ అందించిన థమన్‌కు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు బన్నీ. ఆర్మాన్ మాలిక్, మనోహరమైన విజువల్స్ తీసిన పిఎస్ వినోద్, కంపోజ్ చేసిన జానీ మాస్టర్‌కు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.
ఇక టీజర్ విషయానికి వస్తే…0.57 సెకన్లు ఉన్న ఈ వీడియో అభిమానులను అలరించింది. కొద్దిక్షణాల్లోనే #4 ట్రెండింగ్‌లో చేరడం విశేషం. 14 లక్షల మందికిపైగా వ్యూస్ లభించాయి. ఇక బుట్టబొమ్మ పాటలో బన్నీ వేసిన స్టెప్స్ అదరహో అనిపిస్తున్నాయి. టేబుల్‌పై కూర్చొని, మెట్లపై వస్తూ..గోడకు నిలబడి వేసిన స్టెప్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. పూజా హెగ్గే అందంగా కనబడుతోంది.
మమత ప్రజెంట్‌లో హరికా అండ్ హసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ నిర్మాణంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. మ్యూజిక్ థమన్ అందించారు. ఫైట్స్ రామ్ లక్ష్మణ్, ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ ఉన్నారు.
Read More : ఈగ విలన్‌కు సల్లూ భాయ్ ఖరీదైన గిఫ్ట్