Vikki-Katrina : ఓ వైపు పెళ్లి వేడుకలు.. మరోవైపు విక్కీ కత్రీనాలపై కేసు నమోదు
రాజస్తాన్‌లో వీరి పెళ్లి ఏర్పాట్లకు భారీ బందోబస్తును నియమించారు. ఈ క్రమంలో అక్కడి స్థానికులు విక్కీ-కత్రీనాలపై కేసు నమోదు చేసి షాకిచ్చారు. రాజస్థాన్‌లో చౌత్‌మాత మందిర్ చాలా.....

Vikki Katrina
Vikki-Katrina : బాలీవుడ్ లో ఎక్కడ చూసినా విక్కీ కత్రీనాల పెళ్లి గురించే వినిపిస్తుంది. ఇప్పుడు అదే హాట్ టాపిక్ నడుస్తుంది. ఎక్కడా అధికారిక సమాచారం లేకుండా సీక్రెట్‌గా బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి ఏర్పాట్లు జరగుతున్నాయి. వారి పెళ్లికి సంబంధించిన విషయాలను చాలా గోప్యంగా ఉంచుతున్నారు. అయినా ఏదో ఒక వార్త బయటకి వస్తూనే ఉంది. ఇక పెళ్లి వేడుకల్లో సెల్ ఫోన్స్, పర్సనల్ కెమెరాలకు ఎంట్రీ లేకపోవడంతో వారి పెళ్ళికి సంబంధించిన ఒక్క ఫోటో,వీడియో కూడా బయటకు వచ్చే అవకాశం లేదు.రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోటలో డిసెంబర్ 9న కత్రినా-విక్కీల పెళ్లి జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
Sirivennela : సిరివెన్నెలపై సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్
అయితే ఈ పెళ్ళికి బాలీవుడ్ స్టార్లు, రాజకీయ ప్రముఖులు వస్తుండటంతో భద్రతా పరంగా మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజస్తాన్‌లో వీరి పెళ్లి ఏర్పాట్లకు భారీ బందోబస్తును నియమించారు. ఈ క్రమంలో అక్కడి స్థానికులు విక్కీ-కత్రీనాలపై కేసు నమోదు చేసి షాకిచ్చారు. రాజస్థాన్‌లో చౌత్‌మాత మందిర్ చాలా ఫేమస్ టెంపుల్. నిత్యం భక్తులతో ఈ గుడి రద్దీగా ఉంటుంది. అయితే విక్కీ-కత్రినాల పెళ్లి ఏర్పాట్లలలో భాగంగా ఈ గుడికి వెళ్లే రోడ్డును డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 12 వరకు తాత్కలికంగా ఈవెంట్ నిర్వాహకులు మూసేశారు. దీంతో స్థానికులు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Samantha : చైతూతో విడిపోయిన తర్వాత చనిపోతా అనుకున్నాను : సమంత
ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన నైత్రాబింద్ సింగ్ జాదౌన్ అనే న్యాయవాది జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఫిర్యాదు చేశారు. అంతేకాక స్థానిక పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వారి పెళ్లి వేడుకల కోసం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న అమ్మవారి టెంపుల్ దారిని మూసివేయడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. తన పిటిషన్లో సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ మేనేజర్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌తో పాటు జిల్లా కలెక్టర్‌పై ఫిర్యాదు చేశాడు.
ఈ వారం థియేటర్లలో వచ్చే సినిమాలు
విక్కీ కౌశల్-కత్రీనా పెళ్లికి తాను వ్యతిరేకం కాదని, వారి పెళ్ళికి నాకు సంబంధం లేదు, ఎలాంటి అభ్యంతరం కూడా లేదని తెలిపాడు. కేవలం అమ్మవారి గుడి దారిని మూసివేసిన కారణంగానే తాను ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశాడు. వెంటనే ఆ దారిని తెరవాల్సిందిగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.