Lokesh Kanagaraj : లోకేష్ కనగరాజ్‌పై కేసు నమోదు.. మానసిక పరిస్థితి బాగోలేదంటూ..

లియో సినిమాని లీగల్ సమస్యలు చుట్టుముడుతున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌పై మధురై హైకోర్టు బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. రాజు మురుగన్ అనే వ్యక్తి సినిమాను బ్యాన్ చేయాలని పిటిషన్ దాఖలు చేసారు.

Lokesh Kanagaraj

Lokesh Kanagaraj : లియో సినిమాని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మానసిక పరిస్థితి బాగా లేదని.. అతనికి మానసిక పరీక్షలు నిర్వహించాలని మధురై హైకోర్టు బెంచ్‌లో పిటీషన్ దాఖలైంది.

Thalaivar 171 : లోకేష్ కనగరాజ్ – రజినీకాంత్ సినిమాకి నో చెప్పిన షారుఖ్? ఇంకో బాలీవుడ్ స్టార్ దగ్గరకు లోకేష్..

యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘లియో’ అక్టోబర్ 19 న దసరాకు రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ బాగానే ఆడింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదంతా బాగానే ఉన్నా సినిమాను లీగల్ సమస్యలు పట్టి పీడిస్తున్నాయి.  డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌పై మధురై హైకోర్టు బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది.

లోకేష్ కనగరాజ్ మానసిక పరిస్థితి బాగా లేదని.. అతనికి సైకలాజికల్ పరీక్షలు నిర్వహించాలని మధురైకి చెందిన రాజు మురుగన్ పిటిషన్ వేసారు. సినిమాలో మారణాయుధాలు, డ్రగ్స్, మతపరమైన చిహ్నాలు, మహిళలు, చిన్నారులపై హింసను ప్రేరేపించే సన్నివేశాలు ఉన్నాయని వెంటనే ఈ సినిమాను బ్యాన్ చేయాలని రాజు మురుగన్ పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ పై జస్టిస్​ కృష్ణ కుమార్​, జస్టిస్​ విజయ్​ కుమార్​లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా లోకేష్ తరపు న్యాయవాదులు హాజరు కాకపోవడంతో విచారణ వాయిదా పడింది.

Kaithi 2 : ఖైదీ సీక్వెల్‌లో LCU పాత్రలు అన్ని కనిపించబోతున్నాయి.. లోకేష్ కనగరాజ్

లియోలో దళపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్ సజ్జా, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ నటించారు. అనిరుధ్ సంగీతం అందించగా సెవెన్ స్క్రీన్ స్టూడియోపై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు.