Kaithi 2 : ఖైదీ సీక్వెల్‌లో LCU పాత్రలు అన్ని కనిపించబోతున్నాయి.. లోకేష్ కనగరాజ్
ఖైదీ 2లో LCUలో ఉన్న పాత్రలు అన్ని కనిపించబోతున్నాయని లోకేష్ తెలియజేశాడు.

lokesh kanagaraj bringing all lcu characters into Karthi Kaithi 2
Kaithi 2 : లోకేష్ కానగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ LCUలో తీసుకొచ్చిన మొదటి సినిమా ‘ఖైదీ’. తమిళ హీరో కార్తీ నటించిన ఈ సినిమా 2019లో రిలీజ్ అయ్యి కోలీవుడ్ అండ్ టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ని అందుకుంది. ఇక ఈ మూవీ ఎండింగ్ లోనే సెకండ్ పార్ట్ కి హింట్ ఇవ్వడం, కమల్ హాసన్ ‘విక్రమ్’లో కార్తీ పాత్రని పరిచయం చేయడంతో సీక్వెల్ పై మరింత అంచనాలు నెలకొన్నాయి. ఈ సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఇటీవల LUCలో భాగంగా తెరకెక్కిన విజయ్ ‘లియో’లో విక్రమ్ సినిమా మాదిరి గెస్ట్ అపిరెన్స్ లు ఏమన్నా ఉంటాయా అని ఆడియన్స్ భావించారు. కానీ అలాంటివి ఏమి కనిపించలేదు. అయితే ఖైదీ 2లో మాత్రం LCUలో ఉన్న పాత్రలు అన్ని కనిపించబోతున్నాయని లోకేష్ తెలియజేశాడు. ఖైదీ 2 ఒక పాత్రకి సంబంధించిన సినిమా కాదని, దానిలో విక్రమ్, రోలెక్స్, అమర్, లియో.. ఇలా అన్ని పాత్రలు ఉండనున్నాయని వెల్లడించాడు. కాగా లోకేష్ ఖైదీ 2 కంటే ముందు రజినీకాంత్ తో ఒక సినిమా చేయబోతున్నాడు.
Also read : Prabhas : సర్జరీ పూర్తి చేసుకున్న ప్రభాస్.. యూరప్ నుంచి తిరిగి రానున్నాడు..
ఒకవేళ ఆ మూవీ కూడా LCUలో భాగంగా తెరకెక్కితే.. రజినీకాంత్ కూడా ఖైదీ 2లో కనిపించే అవకాశం ఉంటుంది. రజినీకాంత్ సినిమా పనులతో పాటు ఖైదీ 2 పనులు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం లోకేష్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఖైదీ సీక్వెల్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇటీవల రిలీజ్ చేసిన లియో సినిమాలో విజయ్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఫేక్ అని కూడా లోకేష్ వెల్లడించాడు. ఒరిజినల్ ఫ్లాష్ బ్యాక్ లో ఖైదీ పాత్రకి ఏమన్నా కనెక్షన్ ఉంటుందా..? అనేది దానిపై కూడా క్యూరియాసిటీ నెలకుంది.