Case registered against Posani Krishna Murali
Posani Krishna Murali : పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రచయితగా కెరీర్ ప్రారంభించి స్టార్ స్టేటస్ సంపాదించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వంటి స్టార్ డైరెక్టర్లు ఆయన శిష్యులుగా పనిచేసిన వారే. పోసాని కృష్ణ మురళి నటుడిగా కూడా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించాడు. ఇటీవల ఏపీ గవర్నమెంట్ అతని ‘ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్’గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Chiranjeevi : పవన్ రాజకీయాలకు తగినవాడు.. పాలిటిక్స్ గురించి మరోసారి మాట్లాడిన చిరంజీవి..
తాజాగా పోసానిపై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. గతంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయగా, రాజమహేంద్రవరం జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో పోలీసులు ఆ కేసుని నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించారు జనసైనికులు.
ఇప్పుడు పోసానిపై కేసు నమోదు చేయాలంటూ కోర్టు పోలీసులను ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు పోసానిపై ఐపీసీ సెక్షన్లు 354, 355, 500, 504, 506, 507, 509 కింద కేసు నమోదు చేశారు. కాగా 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరిన పోసాని ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేశాడు. తరువాత వైసీపీ స్టార్ట్ అయ్యాక జగన్ కి దగ్గరయ్యాడు.