Chiranjeevi : పవన్ రాజకీయాలకు తగినవాడు.. పాలిటిక్స్ గురించి మరోసారి మాట్లాడిన చిరంజీవి..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాలు గురించి మాట్లాడారు. ఈ ఆదివారం ఎర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల పూర్వవిద్యార్థుల అందరూ కలిసి 'గెట్ టు గెథెర్' ప్రోగ్రామ్ ని నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశాడు. ఇక చిరు కళాశాల స్నేహితులతో కలిసి నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఈ క్రమంలోనే మాట్లాడుతూ చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి, రాజకీయాలు గురించి వ్యాఖ్యలు చేశాడు.

Chiranjeevi : పవన్ రాజకీయాలకు తగినవాడు.. పాలిటిక్స్ గురించి మరోసారి మాట్లాడిన చిరంజీవి..

Chiranjeevi comments on Pawan Kalyan Political Career

Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాలు గురించి మాట్లాడారు. ఈ ఆదివారం ఎర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల పూర్వవిద్యార్థుల అందరూ కలిసి ‘గెట్ టు గెథెర్’ ప్రోగ్రామ్ ని నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశాడు. హైదరాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో పాత మిత్రులతో కలిసి చిరు సందడి చేశాడు.

Chiranjeevi: చిరంజీవితో భేటీ అయిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్..

ఈ సమావేశానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు నారాయణమూర్తి కశాళాల పూర్వ విద్యార్థులు. ఇక చిరు కళాశాల స్నేహితులతో కలిసి నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఈ క్రమంలోనే మాట్లాడుతూ చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి, రాజకీయాలు గురించి వ్యాఖ్యలు చేశాడు. “ఏదైనా ఒకటి అనుకుంటే దాని అంతు చూడడం నా అలవాటు, కానీ నేను అలా అంతు చూడకుండా వచ్చేసింది రాజకీయాలు.

మనం సున్నితమైన మనసు కలిగి ఉంటే అక్కడ రాణించడం చాలా కష్టం. రాజకీయాల్లో మొరటిగా ఉండాలి, మాటలు అనాలి, అనిపించుకోవాలి. నాకు అవసరమా ఇది. కానీ ఇందుకు పవన్ తగినవాడు. తాను అంటాడు, అనిపించుకుంటాడు. అలాంటి వాడికి మీరందరు తోడుండి, సహాయసహకారాలు – అశీసులు అందిస్తే పవన్ ని ఏదొక రోజు అత్యున్నత స్థాయిలో తప్పక చూస్తాము” అంటూ వ్యాఖ్యానించాడు.