CCL 2024 Promo Launch : బుర్జ్ ఖలీఫాపై సీసీఎల్‌ 2024 ప్రోమో లాంచ్‌.. ఎంత అందంగా ఉందో?

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 10వ సీజ‌న్‌కు రంగం సిద్ద‌మైంది.

CCL 2024 Promo Launch : బుర్జ్ ఖలీఫాపై సీసీఎల్‌ 2024 ప్రోమో లాంచ్‌.. ఎంత అందంగా ఉందో?

CCL 2024 Promo Launch

Updated On : February 3, 2024 / 10:18 AM IST

CCL 2024 Promo : సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 10వ సీజ‌న్‌కు రంగం సిద్ద‌మైంది. ఫిబ్ర‌వ‌రి 23 నుంచి సీసీఎల్ 10వ సీజ‌న్ ఆరంభం కానుంది. ఈ క్ర‌మంలో ఈ సీజ‌న్‌కు సంబంధించిన ప్రొమోను ఆవిష్క‌రించారు. శుక్ర‌వారం సాయంత్రం దుబాయ్‌లోని బుర్జ్ ఖ‌లీఫా పై దీనిని ప్ర‌ద‌ర్శించారు. ప‌లువురు న‌టులు దీనిని ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు. బుర్జ్ ఖ‌లీఫా పై ప్రొమోను ప్ర‌ద‌ర్శించ‌డం పై అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

బుర్జ్ ఖలీఫా ప్రోమో లాంచ్ గురించి కిచ్చా సుదీప్ మాట్లాడుతూ.. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న సినిమాల‌ను బుర్జ్ ఖ‌లీఫా పై చూసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. అయితే.. ఓ క్రికెట‌ర్‌గా బుర్జ్ ఖ‌లీఫా పై చూడ‌డం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ద‌ని, మ‌రిచిపోలేద‌ని అన్నారు.

Kartik Aaryan : ‘చందు ఛాంపియన్’ మూవీ కోసం కార్తీక్ ఆర్యన్ ఏడాదిగా షుగర్ తినలేదట..

సోనూ సూద్ మాట్లాడుతూ.. దేశంలోని ఎనిమిది శ‌క్తివంతమైన చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సూప‌ర్ స్టార్‌ల‌తో క‌లిసి ప్ర‌పంచంలోని అత్యంత ఎత్తైన ఐకానిక్ నిర్మాణం ముందు నిల‌బ‌డ‌డం త‌న అదృష్టంగా భావిస్తున్న‌ట్లు తెలిపాడు. సీసీఎల్ ప్రొమో బుర్జ్ ఖలీఫా పై ఆవిష్క‌రించ‌డం నిజంగా గొప్ప అనుభూతి అని ఈ సీజ‌న్ త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌న్నారు.

సీసీఎల్ 2024 సీజ‌న్‌లో ఎనిమిది బాష‌ల‌కు చెందిన న‌టీన‌టులు 8 టీమ్స్ లు విడిపోయి మ్యాచులు ఆడ‌నున్నారు. బెంగాల్ టైగర్స్‌కు జిషు సేన్ గుప్తా, చెన్నై రైనోస్ ఆర్య, కర్నాటక బుల్డోజర్స్‌కు కిచ్చా సుదీప్, కేరళ స్ట్రైకర్స్ కు కుంచకో బోబన్, ముంబయి హీరోస్‌కు రితేష్ దేశ్‌ముఖ్, పంజాబ్ డీ షేర్స్ కు సోనూ సూద్, భోజ్‌పురి దబాంగ్స్ కు మనోజ్ తివారీ, తెలుగు వారియర్స్ కు అక్కినేని అఖిల్ లు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Poonam Pandey : పూనమ్ పాండే వార్తల్లో నిలిచిన ప్రధాన వివాదాలు ఇవే..

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ ఇందూరి మాట్లాడుతూ.. సీసీఎల్ మొద‌టి రోజు నుంచి అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని చెప్పారు. ప్ర‌తి సంవ‌త్స‌రం లీగ్ వృద్ది చెందుతుంద‌న్నారు. తార‌లు సినీ షూటింగ్‌లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ కూడా క్రికెట్ ఆడేందుకు ముందు రావ‌డం వారికి లీగ్ పై ఉన్న ఇష్టానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. సీసీఎల్ 2024 సీజ‌న్‌లోని మ్యాచులు అభిమానుల‌కు కావాల్సినంత మ‌జాను అందిస్తాయ‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు.