Ratan Tata : రతన్‌ టాటాకు సినీ ప్రముఖుల నివాళి..

దిగ్గ‌జ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) క‌న్నుమూశారు.

Celebrities condolences to Ratan Tata

Ratan Tata : దిగ్గ‌జ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) క‌న్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్ప‌త్రిలో చికిత్స బుధ‌వారం రాత్రి 11.30 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచారు. ఆయ‌న ఇకలేరు అనే విష‌యాన్ని ఏ ఒక్క‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. సామాన్యులు మొద‌లు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేస్తున్నారు. ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

చిరంజీవి, రాజమౌళి, ఎన్టీఆర్‌, మ‌హేశ్ బాబు, త‌దిత‌రులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేశారు.

Prabhas: ప్రభాస్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా?

‘భారతీయులకు ఇది బాధాకరమైన రోజు. సేవలో రతన్‌టాటాను మించినవారు లేరు. ఇప్పటి వరకు మనదేశం చూసిన గొప్ప దార్శనికుల్లో ఆయన ఒకరు. మెగా ఐకాన్‌. నిజమైన పారిశ్రామిక వేత్త, పరోపకారి. టాటా బ్రాండ్‌లను గ్లోబల్‌ పవర్‌ హౌస్‌గా నిర్మించడమే కాకుండా.. మనదేశ నిర్మాణంలోనూ అద్భుతంగా కృషి చేశారు.

మనం ఒక మంచి మనస్సున్న వ్యక్తిని కోల్పోయాం. భారతీయ పారిశ్రామిక వేత్తలలో ఆయన పెంపొందించిన విలువలు తరాలకు స్ఫూర్తినిస్తాయి. మార్గాన్ని నిర్దేశిస్తాయి. రతన్‌ టాటా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

Rajamouli-Maheshbabu : ఫ్యాన్స్‌కు పండ‌గే.. రాజ‌మౌళి-మ‌హేశ్ బాబు మూవీ పై సూప‌ర్‌ అప్‌డేట్‌