Rajamouli-Maheshbabu : ఫ్యాన్స్‌కు పండగే.. రాజమౌళి-మహేశ్ బాబు మూవీ పై సూపర్ అప్‌డేట్
సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే.

Vijayendra Prasad gave an interesting update about Mahesh and Rajamouli movie
Rajamouli-Maheshbabu : సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. మహేశ్ బాబు కెరీర్‌లో 29వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. SSMB29 వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే రాజమౌళి వెల్లడించారు.
అదిగో ఇదిగో అంటున్నా కూడా ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సూపర్ అప్‌డేట్ ఇచ్చారు.
Samyuktha : కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌తో సంయుక్త
2025 జనవరి నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మహేశ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం మహేశ్ బాబు ఇప్పటికే లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో ఎంతో స్టైలిష్ గా మారారు.
Samantha : సమంత ప్రశంసలు అందుకున్న ’35 చిన్న కథ కాదు’
#SSMB29 Shoot Starts From January 2025
~ Writer Vijayendra Prasad@urstrulyMahesh #MBSSR pic.twitter.com/QbOh14ltwf
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) October 9, 2024