Samantha : సమంత ప్రశంసలు అందుకున్న ’35 చిన్న కథ కాదు’

నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ’35 చిన్న కథ కాదు’.

Samantha : సమంత ప్రశంసలు అందుకున్న ’35 చిన్న కథ కాదు’

Samantha praises 35 Chinna Katha Kaadu movie

Updated On : October 9, 2024 / 1:45 PM IST

Samantha : నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ’35 చిన్న కథ కాదు’. రానా సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మాణంలో నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా పై న‌టి స‌మంత ప్ర‌శంస‌లు జ‌ల్లు కురిపించారు.

అలియా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన జిగ్రా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వెంట్‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన‌ స‌మంత మాట్లాడుతూ.. హీరోయిన్స్‌కి ఎంతో బాధ్యత ఉంటుందన్నారు. ప్రతి అమ్మాయి కథలో ఆ అమ్మాయే హీరో అని తెలిపారు.

Gorre Puranam : కంటెంట్ బేస్డ్ చిత్రాల‌కి కేర్ ఆఫ్ అడ్రస్ ‘ఆహా’లో మరో కొత్త సినిమా.. సుహాస్ ‘గొర్రె పురాణం’ ఎప్ప‌టినుంచంటే?

రానా మంచి చిత్రాల‌ను నిర్మిస్తుంటార‌ని చెప్పారు. గ‌త నెల‌లో ’35 చిన్న కథ కాదు’ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చార‌ని, ఆ చిత్రం ఎంతో బాగుంద‌న్నారు. ప్రతి అమ్మాయికి రానా లాంటి బ్రదర్ ఉండాలని, తెలుగు ప్రేక్షకులే తన ఫ్యామిలీ అని సమంత చెప్పారు.

’35 చిన్న కథ కాదు’ మూవీ సెప్టెంబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. థియేట‌ర్ల‌లో ఈ చిత్రానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇక అక్టోబ‌ర్ 2 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. 105 మిలియ‌న్ ఫ్ల‌స్ స్ట్రీమింగ్‌ మినిట్స్‌ తో ఈ చిత్రం దూసుకుపోతుంది. చ‌దువు రాక ఇబ్బంది ప‌డే పిల్ల‌ల మాన‌సిక ప‌రిస్థితి గురించి, ఆ స‌మ‌యంలో కుటుంబంలో ఉండే సంఘ‌ర్ష‌ణ వంటి అంశాలు ఉండ‌డంతో ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా క‌నెక్ట్ అవుతున్నారు.

Bigg Boss 8 : ఇమిటేట్ చేసిన అవినాష్‌.. ఇరిటేష‌న్ తెప్పించ‌కు అంటూ మండిప‌డ్డ గౌత‌మ్‌.. గ‌ట్టిగానే హ‌ర్ట్ అయిన‌ట్లు ఉన్నారుగా..