Bigg Boss 8 : ఇమిటేట్ చేసిన అవినాష్.. ఇరిటేషన్ తెప్పించకు అంటూ మండిపడ్డ గౌతమ్.. గట్టిగానే హర్ట్ అయినట్లు ఉన్నారుగా..
తాజాగా నేటి ఎపిసోడ్ (అక్టోబర్ 9 బుధవారం)కి సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు.

Bigg Boss Telugu 8 Day 38 Promo 1 Try Not to Laugh Challenge
Bigg Boss 8 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఆరో వారం కొనసాగుతోంది. వైల్డ్‌కార్డు ఎంట్రీస్‌తో ప్రస్తుతం హౌస్‌లో 16 మంది ఉన్నారు. నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కావడంతో బిగ్‌బాస్ కంటెస్టంట్ల చేత ఆటలు ఆడిస్తున్నాడు. తాజాగా నేటి ఎపిసోడ్ (అక్టోబర్ 9 బుధవారం)కి సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు.
ఈ ఇళ్లు ఇప్పుడు సమానంగా విభజింపబడుతుంది. ఈ ఛాలెంజ్‌లో మొదటి రౌండ్ నవ్వకుండా ఉండడానికి ప్రయత్నించు అనే టాస్క్‌ను బిగ్‌బాస్ పెట్టాడు. అవినాష్ అమ్మాయిల లీడర్‌గా, రోహిణి అబ్బాయిల లీడర్‌గా ఉండాలని సూచించాడు. వెంటనే రోహిణి మాట్లాడుతూ.. బిగ్‌బాస్ మీరు కన్‌ప్యూజ్ అయినట్లుగా ఉన్నారు. నేను అమ్మాయిని, ఈయన అబ్బాయి అని చెప్పింది. తాను సరిగ్గానే చెప్పానని బిగ్‌బాస్ అన్నారు.
Janaka Aithe Ganaka Release Trailer : సుహాస్ ‘జనక అయితే గనక’ రిలీజ్ ట్రైలర్.. నవ్వులే నవ్వులు..
ఇక టాస్క్‌లో భాగంగా రోహిణి.. అమ్మాయిలను నవ్వించడానికి ప్రయత్నం చేసింది. ఎవ్వరూ నవ్వనట్లుగా కనిపించింది. అవినాష్ పాట పాడగా అబ్బాయిలు అంతా నవ్వేశారు. ఇక ప్రొమో ఆఖర్లో అవినాష్.. అశ్వర్థామ 2.0 వచ్చాడు అని అనగా.. బ్రో ఒక్క సెకన్ ఆగు.. అంటూ గౌతమ్ ఫైర్ అయ్యాడు.
అది సీజన్ 7లో అయిపోయింది. మళ్లీ, మళ్లీ తీసి ఇరిటేషన్ తెప్పించకండి, వెళ్లిపోమంటే వెళ్లిపోతా అంటూ గౌతమ్ అన్నాడు. తన మైక్‌ను తీసి పక్కన పడేసి గౌతమ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో అవినాష్ బిగ్‌బాస్ నేను ఈ టాస్క్ ఆడను అన్నాడు. చూస్తుంటే అవినాష్ కామెడీగా చేసిన దానికి గౌతమ్ బాగానే హర్ట్ అయినట్లు కనిపిస్తోంది.
Bigg Boss 8 : 6వ వారం నామినేషన్స్‌లో ఉంది ఎవరంటే? ఏడ్చేసిన నయని పావని.. సారీ చెప్పిన తేజ..